Rave party : బెంగళూరులో రేవ్ పార్టీ భగ్నం

బెంగళూరులో రేవ్ పార్టీ భగ్నం

బెంగళూరు రూరల్ జిల్లాలో రేవ్ పార్టీ(Rave party)పై పోలీసులు దాడి చేశారు. దేవనహళ్లి తాలూకాలోని కన్నమంగళ గేట్ సమీపంలోని ఒక ఫామ్‌హౌస్‌లో పార్టీ జరుగుతోందని సమాచారం రావడంతో పోలీసులు ఉదయం 5 గంటలకు దాడి చేశారు.

Rave Party Involving 100 Busted In Bengaluru, 5 Arrested

ఈ దాడిలో కొకైన్, హైడ్రో, గంజాయి వంటి నిషేధిత మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. రేవ్ పార్టీలో(Rave party)  పాల్గొన్న మొత్తం 31 మంది యువతీ యువకులను అరెస్టు చేశారు. వీరిలో దాదాపు 20 మంది యువకులు, 10 మంది మహిళలున్నారు. వీళ్లలో అత్యధికులు ఐటీ ఉద్యోగులే.

Rave Party In Delhi: Top 12 Spots For Experiencing Nightlife - TripXL

పుట్టినరోజు వేడుకల కోసం నిర్వహించిన ఈ రేవ్ పార్టీలో ఏడుగురు చైనా మహిళలు కూడా పాల్గొన్నారు. అరెస్టు అయినవారిలో మాదకద్రవ్యాల వినియోగదారులతో పాటు సరఫరాదారులు ఇద్దరూ ఉన్నారని నార్త్ ఈస్ట్ జోన్ డిప్యూటీ కమిషనర్ వీజే సజీత్ తెలిపారు.

Bengaluru readies for safe New Year celebrations, bans masks, whistling at  public places | Bengaluru News – India TV

కస్టడీలోకి తీసుకున్న నిందితుల రక్తం, మూత్ర నమూనాలను సేకరించారు. విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపారు. నివేదిక అందిన తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

 

Also read :

PM Modi : మహిళల జోలికొస్తే ఊరుకుంటామా?

Jyoti Malhotra : జ్యోతి మల్హోత్రాకు ఆరుగురు గన్​మెన్లు