సంక్రాంతి పండుగకు మాస్ మాహరాజా రవితేజ (Ravi Teja) మళ్లీ థియేటర్లలో సందడి చేయనున్నారు. ప్రస్తుతం ఆయన దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేస్తున్న కొత్త సినిమా టైటిల్‌గా “భర్త మహాశయులకు విజ్ఞప్తి” అనే పేరును (Ravi Teja) పరిశీలిస్తున్నారని సమాచారం.
ఈ సినిమాలో హీరోయిన్లుగా కేతిక శర్మ మరియు ఆషిక రంగనాథ్ నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉండగా, సంక్రాంతి బరిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. పోటీ ఉన్నా, ఫెస్టివల్ సీజన్ లో రవితేజ మాస్ ఫాలోయింగ్‌పై నమ్మకం ఉంచారు.
ఇదే కాదు, ఈ సినిమా తర్వాత రవితేజ శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక థ్రిల్లర్ సినిమాకు అంగీకరించినట్లు టాక్ ఉంది. ‘మజిలీ’, ‘ఖుషి’ వంటి లవ్ స్టోరీస్‌కి పేరుగాంచిన శివ నిర్వాణ ఇప్పుడు కొత్త జానర్ ట్రై చేయబోతున్నారు.
అలాగే రవితేజ మరో సినిమా కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కనుంది. ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కళ్యాణ్ శంకర్, ఇప్పుడు రవితేజతో కలిసి సూపర్ హీరో ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం.
మొత్తం మీద, ఈ సంక్రాంతి నుంచి రవితేజ ఫ్యాన్స్‌కు మాస్ మజా గ్యారెంటీ!
అలాగే రవితేజ మరో సినిమా కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కనుంది. ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కళ్యాణ్ శంకర్, ఇప్పుడు రవితేజతో కలిసి సూపర్ హీరో ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం.మొత్తం మీద, ఈ సంక్రాంతి నుంచి రవితేజ ఫ్యాన్స్‌కు మాస్ మజా గ్యారెంటీ!
Also read:
- Legally Veer: లయన్స్ గేట్ ప్లేలో ‘లీగల్లీ వీర్’ స్ట్రీమింగ్
- Prabhas: ప్రభాస్ బర్త్‌డే స్పెషల్ ట్రిపుల్ ట్రీట్!

