కామారెడ్డి, మెదక్ జిల్లాలు కుండపోత (RedAlert) వర్షాలతో అతలాకుతలం అవుతున్నాయి. అనేక చోట్ల వాగులు, వంకలు పొంగిపోర్లడంతో జన జీవనం స్తంభించింది. గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో కొన్ని తండాలు (RedAlert) జలదిగ్భంధంలో చిక్కుకుపోయాయి.
వర్షాల తీవ్రత కారణంగా పలు రోడ్లు కొట్టుకుపోవడంతో రవాణా అంతరాయం ఏర్పడింది. వాహనాల రాకపోకలు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల పంటలు నీట మునగడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు.
జంగంపల్లి వద్ద భారీగా వరద నీరు రోడ్డుపై నుంచి ప్రవహించడంతో కామారెడ్డి-హైదరాబాద్ జాతీయ రహదారిపై రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ మార్గంలో ప్రయాణించేవారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఇక వాతావరణశాఖ తాజా నివేదిక ప్రకారం, ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతున్నందున, తెలంగాణలో మరిన్ని రోజులపాటు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
మెదక్, కామారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయబడింది. అదేవిధంగా పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.
🌧️ అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండమని, అవసరమైతే ఇళ్లలోనే ఉండాలని సూచించారు. నదులు, వాగులు, వంకల సమీపానికి వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు.
Also read:

