Kishan Reddy: రాజీనామా చేసి పార్టీ మారాలె

కాంగ్రెస్ పార్టీ పార్టీ ఫిరాయింపులను అజెండాగా పెట్టుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy)ఆరోపించారు. ఇవాళ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక పార్టీపై గెలిచి మరో పార్టీలో చేరడం కరెక్ట్ కాదన్నారు. ప్రజాభిప్రాయాన్ని కాలరాసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

దమ్ము, ధైర్యం ఉంటే రాజీనామా చేసి పార్టీ మారాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భయకరమైన నిజాలు బయటికి వస్తున్నాయని విమర్శించారు. గత ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేలా వ్యవహరించిందని అన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛను హరించి వేసిందని ఆరోపించారు. తమ స్వలాభం కోసం రిటైర్డ్ అధికారులను అడ్డం పెట్టుకొని ట్యాపింగ్ వ్యవహరం నడిపించిందనని అన్నారు.

ప్రతిపక్షాల ఫోన్లను ఇష్టారీతిన ట్యాపింగ్ చేశారని అన్నారు. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ సర్కారు ఫోన్ల ట్యాపింగ్ కు పాల్పడిందన్నారు. పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు, సమాజంలోని పెద్దల ఫోన్లు ట్యాపింగ్ కు గురయ్యాయని, ఈ క్రమంలో అక్రమ వసూళ్లు జరిగాయని విమర్శించారు.

 

Also read :

Whatsapp: మీ వాట్సాప్ పనిచేస్తుందా?

Maharastra: ఏడుగురు సజీవ దహనం