Revanth Reddy: సిటీ బస్టాపుల్లో గాడిద గుడ్డు!

Revanth Reddy

పార్లమెంటు ఎన్నికల సమయంలో సీఎం (Revanth Reddy) రేవంత్ రెడ్డి.. వినూత్నంగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అన్ని సభలో టాయ్ ఎగ్ ను తీసుకెళ్లి ప్రజలకు అర్థమయ్యేలా ప్రచారం చేశారు. పదేండ్లలో మోదీ ప్రభుత్వం మనకు గాడిదగుడ్డు ఇచ్చిందని టాయ్ ఎగ్ ను చూపించారు. ఈ సారి బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై తీవ్ర వివక్ష చూపించిందని, కనీసం రాష్ట్రం పేరును కూడా ప్రస్తావించలేదని తెలంగాణ ప్రభుత్వం ఫైర్ అవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ పై ఇవాళ అసెంబ్లీలో చర్చ జరుపుతోంది. ఈ క్రమంలో కేంద్రం తీరుపై సీఎం (Revanth Reddy),  డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఫైర్ అవుతున్నారుBRS వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో మారు గాడిదగుడ్డు తెరపైకి వచ్చింది. Image8 మంది ఎంపీలను గెలిపిస్తే.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిందని పేర్కొంటూ జంట నగరాల్లోని బస్టాప్ ల వద్ద హోర్డింగులను ఏర్పాటు చేసింది. ఐటీఐఆర్ పునరుద్ధరణ, నవోదయ విద్యాలయాల ఏర్పాటు, కేంద్రీయ విద్యాలయాలు, ఎంఐఎం, మూసీ రివర్ ఫ్రంట్ మేనేజ్ మెంట్, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా, బయ్యారానికి ఉక్కు పరిశ్రమ, సమ్మక్క, సారలమ్మ గిరిజన వర్సిటీ, కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ ఇలా ఎన్నో డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ముందుంచింది. అంతటితో ఆగక సీఎం రేవంత్ రెడ్డి, వివిధ శాఖల మంత్రులు స్వయంగా ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి నిధులు కేటాయించాలంటూ వినతిపత్రాలు సమర్పించారు. ఆ సమయంలో సానుకూలంగా స్పందించిన మంత్రులు బడ్జెట్ దగ్గరకు వచ్చే సరికి ఏమీ ఇవ్వలేదు. దీంతో కేంద్రం తీరుపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ తరఫున పోటీ చేసిన 8 మందిని పార్లమెంటుకు పంపినా రాష్ట్రానికి ఏమీ తేలేక పోయారనే విమర్శలు వస్తున్నాయి. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి కూడా రాష్ట్రానికి నిధులు తేలేదనే చర్చ బహిరంగంగానే సాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మనకు కేవలం గాడిద గుడ్డు మాత్రమే ఇచ్చిందని సామాన్యులకు అర్థమయ్యే రీతిలో పోస్టర్లు, హోర్టింగ్ లను ఏర్పాటు చేసి జంటనగరాల్లోని బస్టాప్ లు ముఖ్య కూడళ్లలో ఏర్పాటు చేశారు.  సిటీబస్టాపుల్లోగాడిగుడ్డు!
పార్లమెంటు ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి.. వినూత్నంగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అన్ని సభలో టాయ్ ఎగ్ ను తీసుకెళ్లి ప్రజలకు అర్థమయ్యేలా ప్రచారం చేశారు. పదేండ్లలో మోదీ ప్రభుత్వం మనకు గాడిదగుడ్డు ఇచ్చిందని టాయ్ ఎగ్ ను చూపించారు. ఈ సారి బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై తీవ్ర వివక్ష చూపించిందని, కనీసం రాష్ట్రం పేరును కూడా ప్రస్తావించలేదని తెలంగాణ ప్రభుత్వం ఫైర్ అవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ పై ఇవాళ అసెంబ్లీలో చర్చ జరుపుతోంది. ఈ క్రమంలో కేంద్రం తీరుపై సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఫైర్ అవుతున్నారు. బీఆర్ఎస్ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో మారు గాడిదగుడ్డు తెరపైకి వచ్చింది. 8 మంది ఎంపీలను గెలిపిస్తే.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిందని పేర్కొంటూ జంట నగరాల్లోని బస్టాప్ ల వద్ద హోర్డింగులను ఏర్పాటు చేసింది. ఐటీఐఆర్ పునరుద్ధరణ, నవోదయ విద్యాలయాల ఏర్పాటు, కేంద్రీయ విద్యాలయాలు, ఎంఐఎం, మూసీ రివర్ ఫ్రంట్ మేనేజ్ మెంట్, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా, బయ్యారానికి ఉక్కు పరిశ్రమ, సమ్మక్క, సారలమ్మ గిరిజన వర్సిటీ, కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ ఇలా ఎన్నో డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ముందుంచింది. అంతటితో ఆగక సీఎం రేవంత్ రెడ్డి, వివిధ శాఖల మంత్రులు స్వయంగా ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి నిధులు కేటాయించాలంటూ వినతిపత్రాలు సమర్పించారు. ఆ సమయంలో సానుకూలంగా స్పందించిన మంత్రులు బడ్జెట్ దగ్గరకు వచ్చే సరికి ఏమీ ఇవ్వలేదు. దీంతో కేంద్రం తీరుపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ తరఫున పోటీ చేసిన 8 మందిని పార్లమెంటుకు పంపినా రాష్ట్రానికి ఏమీ తేలేక పోయారనే విమర్శలు వస్తున్నాయి. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి కూడా రాష్ట్రానికి నిధులు తేలేదనే చర్చ బహిరంగంగానే సాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మనకు కేవలం గాడిద గుడ్డు మాత్రమే ఇచ్చిందని సామాన్యులకు అర్థమయ్యే రీతిలో పోస్టర్లు, హోర్టింగ్ లను ఏర్పాటు చేసి జంటనగరాల్లోని బస్టాప్ లు ముఖ్య కూడళ్లలో ఏర్పాటు చేశారు.

Also read:

Soundaryasharma: డాక్టర్.. యాక్టర్

AP :అమరావతికి 15 వేల కోట్లు