Revanth Reddy: న్యాయబద్ధమైన డీలిమిటేషన్ కోసం పోరాడుదాం

Revanth Reddy

డీలిమిటేషన్ ప్రక్రియను మరో పాతికేండ్ల పాటు వాయిదా వేయాలని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) డిమాండ్ చేశారు. ఒక వేళ తప్పనిసరిగా చేయాల్సి వస్తే దక్షిణాది రాష్ట్రాలకు మొత్తం లోక్ సభ సీట్లలో 33% ఉండేలా చూడాలని అన్నారు. న్యాయబద్ధమైన డీలిమిటేషన్ కోసం సమిష్టిగా పోరాడుదామని పిలుపునిచ్చారు. ఇవాళ చెన్నయ్ లోని హోటల్ ఐటీసీ చోళలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) హాజరై మాట్లాడారు. న్యాయబద్ధం కానీ డీలిమిటేషన్‌పై మనమంతా బీజేపీని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గాల పునర్విభజన రాజకీయంగా దక్షిణాదిని పరిమితం చేస్తుందని, ఇది రాజకీయ అసమానతలకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గ పునర్విభజన దక్షిణాది అంగీకరించదన్నారు.

Imageగతంలో వాజ్‌పేయి లోక్‌సభ సీట్లు పెంచకుండానే డీలిమిటేషన్ చేశారని, ఇప్పుడు మోడీ కూడా అదే పని చేయాలన్నారు. కేంద్ర నిధుల్లో దక్షిణాది రాష్ట్రాలకు నిధుల్లో సరైన వాటా రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్థిక అభివృద్ధి జీడీపీ, ఉద్యోగ కల్పనతో దక్షిణాది రాష్ట్రాలు ముందున్నాయన్నారు. దేశానికి దక్షిణాది రాష్ట్రాలు ఇచ్చేది ఎక్కువ మనకు తిరిగి వచ్చేది తక్కువ అని అన్నారు. పన్నుల రూపంలో తెలంగాణ నుంచి వెళ్లే రూపాయికి కేంద్రం తిరిగి ఇచ్చేది కేవలం 42 పైసలు మాత్రమే అని చెప్పారు. బీహార్ రాష్ట్రం రూపాయి చెల్లిస్తే ఆరు రూపాయలు కేంద్రం ఇస్తోందని చెప్పారు. యూపీ కూడా రూపాయి పన్నులు కట్టి రెండు రూపాయలు తీసుకుంటోందని అన్నారు. ఈ అసమానతలు ఇంకా పెరిగే అవకాశం ఉందని, లోక్‌స‌భ స్థానాల పెంపును మ‌రో 25 ఏళ్లపాటు వాయిదా వేయాలని కోరారు.

Image

చెన్నయ్ లో జరిగిన అఖిలపక్ష సమావేశానికి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గైర్హాజరయ్యారు. జగన్ కూడా సమావేశానికి వెళ్లలేదు. ఆయన లేఖ రాశారు. బీజేడీ అధినేత, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ సమావేశానికి హాజరు కాలేదు. ఆయన వర్చువల్ గా సమావేశానికి హాజరయ్యారు. జనాభా ప్రాతిదికన డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా సమావేశానికి హాజరు కాకపోవడం గమనార్హం. టీడీపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల ప్రతినిధులు సైతం మీటింగ్ కు దూరంగా ఉండటం గమనార్హం.

Also read: