Revanth: కేసీఆర్ అంగిలాగు ఊడబీకి

revanth

మాజీ ముఖ్యమంత్రి తీరుపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth)  తనదైన శైలిలో స్పందించారు. తుక్కుగూడ వేదికగా కేసీఆర్ పై విరుచుకు పడ్డారు. కేసీఆర్ ను గుంట నక్కతో పోల్చారు. మొన్న సూర్యాపేట, నిన్న కరీంనగర్ కు పోయి నా (Revanth) వెంట్రుక కూడా పీకలేరంటూ సవాలు విసిరారని, అది ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటేనా అని అన్నారు. పదేండ్లు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రం మీద అడవిపందుల్లా దాడి చేసి నాశనం చేసిన ఘన చరిత్ర కేసీఆర్ దని అన్నారు. బిడ్డా కేసీఆర్ మా కార్యకర్తలు అనుకుంటే నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదంటూ ఫైర్ అయ్యారు.

మా పార్టీ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ పట్ల మర్యాదగా ప్రవర్తించామని, కానీ ఆయన బుద్ధి మారడం లేదని అన్నారు. ‘నే ను పెద్దలు జానారెడ్డిలా కాదు.. నేను రేవంత్ రెడ్డిని అంగిలాగు ఊడబీకి చర్లపల్లి జైల్లో చిప్పకూడా తినిపిస్త బిడ్డా.. అంటూ హెచ్చరించారు. తాను ఎన్నికలకు ముందు చెప్పినట్టుగానే చర్లపల్లి జైల్లో కేసీఆర్ కు డబుల్ బెడ్రూం ఇల్లు పక్కాగా కట్టిస్తామని చెప్పారు. ఆ బాధ్యత తాను తీసుకుంటానని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పారు. గత ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే ఆరు గ్యారెంటీలను అమలు చేసి చూపించామని అన్నారు. మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ను తొక్కిపడేశామని, ఈ ఎన్నికల్లో బీజేపీని తొక్కి పడేస్తామని అన్నారు. ఈ సారి ఎర్రకోటమీద కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా అని అన్నారు. సునామీలా తరలివచ్చిన ప్రజలకు, కార్యకర్తలకు రేవంత్ రెడ్డి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Also read: