Shubman Gill: నటి రిధిమా, క్రికెటర్ శుభ్‌మాన్ గిల్‌ పెళ్లి

Subman gill

టీవీ నటి రిధిమా పండిట్, క్రికెటర్ శుభ్‌మాన్ గిల్‌ (Shubman Gill) పెళ్లి చేసుకోబోతున్నారని గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్ లో వీరిద్దరు ఒక్కటి కాబోతున్నారని కథనాలు వెలువడ్డాయి. రాజస్థాన్ లో పెళ్లి వేడుకలు జరగనున్నట్లు వార్తలొచ్చాయి. అయితే వీటిపై రిధిమా తాజాగా స్పందించింది. అవన్నీ పుకార్లేనని కొట్టి పారేసింది. తాను శుభ్ మన్ గిల్ (Shubman Gill) ను పెళ్లి చేసుకోవడం లేదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఇన్‌స్టా స్టోరీస్ లో ఓ వీడియోను కూడా ఆమె పోస్ట్ చేసింది. తన పెళ్లి గురించి చాలా మంది జర్నలిస్టుల నుంచి కాల్స్ వచ్చాయని.. కానీ తానిప్పుడే పెళ్లి చేసుకోవడం లేదని స్పష్టం చేసింది. తన జీవితంలో ఇలాంటి ముఖ్యమైన సంఘటనలు జరిగితే.. స్వయంగా తానే వెల్లడిస్తానని పేర్కొంది. కాగా పెళ్లి ఊహాగానాలపై శుభమాన్ గిల్ ఇంకా స్పందించలేదు. గతంలో నటి సారా అలీ ఖాన్, సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌తో శభ్ మన్ డేటింగ్‌లో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి.

Also read: