రీతూ వర్మ (Ritu Varma) హీరోయిన్ గా నటిస్తున్న సినిమా స్వాగ్ ట్రైలర్ గంట కింద రిలీజ్ అయింది. ఈ సినిమా లో శ్రీ విష్ణు హీరో గా రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తున్నారు. రాజా రాజా చోర టీం ఈ సినిమా తీస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ ట్రైలర్ తొమ్మిది రోజుల క్రితం రిలీజ్ చేశారు, అయితే ఆ ట్రైలర్ లో యూట్యూబ్ నటి గంగవ్వ కోతికి డబ్బింగ్ చెప్పి ప్రేక్షకులను భలే నవ్వించింది.


హ్యాపీ బర్త్ డే రుక్మిణి దేవి!
రీతూ వర్మ (Ritu Varma) పుట్టినరోజు సందర్బంగా ఈరోజు మరో ట్రైలర్ రిలీజ్ చేశారు అందులో తెల్ల చీరలో రాణి గెటప్ లో ఉంది మన తెలుగు హీరోయిన్ రీతూ. కానీ స్మార్ట్ ఫోన్ లో తొమ్మిది రోజుల కింద ఈ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తూ.. ‘మగవాడు అంటేనే పగవాడు’ అంటూ రాణి స్టైల్ లో పవర్ఫుల్ డైలాగ్ చెప్పి.. క్వీన్ కా స్వాగ్ అని మరో ట్రైలర్ రిలీజ్ చేసింది.

Also read:

