రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్, కాలేజీ బస్సులపై ఆర్టీఏ (RTA) అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఫిట్ నెస్ లేకుండా నడుపుతున్న బస్సులపై కేసు నమోదు చేసి సీజ్ చేస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఫిట్ నెస్ లేని , టాక్సీ కట్టని 34 బస్సులు సీజ్ చేశారు. జగిత్యాల జిల్లాలో స్కూల్ బస్సులను ఆర్టీఏ (RTA) అధికారులు తనిఖీ చేశారు. బస్సు ఫిట్ నెస్, ఇన్సూరెన్స్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్ , ఫైర్ సేఫ్టీ, ఫస్ట్ ఎయిడ్ కిట్లను తనిఖీ చేశారు. ఫిట్ నెస్ లేని 3 స్కూల్ బస్సులను సీజ్ చేశారు. జిల్లాలో 464 స్కూల్ కాలేజ్ బస్సులో గాను 300 పైసలు బస్సులు మాత్రమే ఫిట్ నెస్ కలిగి ఉన్నాయన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ప్రైవేట్ స్కూల్ బస్సుల పైన ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుస్తున్న రెండు బస్సులకు జరిమానా విధించారు.
Also read:

