TSRTC : మహాలక్ష్మితో ఆర్టీసీకి లాభాలు

మహాలక్ష్మితో ఆర్టీసీకి లాభాలు

నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీని (TSRTC) లాభాల బాట పట్టించడంలో మహాలక్ష్మి పథకం ఉపయోగపడిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన విజయోత్సవ వేడుకలలో భాగంగా ఇవాళ రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో సీఎం రవాణాశాఖ లోగోను ఆవిష్కరించారు. ప్రజావిజయోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ, ఆర్టీసీ (TSRTC)సాధించిన విజయాలపై బ్రోచర్ ను విడుదల చేశారు. వెహికిల్ స్క్రాప్ పాలసీని సీఎం ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ (TSRTC)కార్మికులు కీలక భూమిక పోషించారని, సకల జనుల సమ్మెలో జంగు సైరన్ ఊదారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఆర్టీసీ(TSRTC) కార్మికులకు అడుగడుగునా అన్యాయం జరిగిందని అన్నారు. కారుణ్య నియామకాలు జరగలేదని, కార్మికుల ఆకాంక్షలు నెరవేరలేదని అన్నారు. దీంతో కార్మికులు ఉద్యమబాట పట్టారని గుర్తు చేశారు. ఆ నాటి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 50 మంది కార్మికులు రోడ్డున పడ్డారని గుర్తు చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ కార్మికుడు ఆత్మహత్య చేసుకుంటే నాటి సీఎం కనీసం పరామర్శించలేదని అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఎంతో మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. తాము హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు కండక్టర్లు బ్రాండ్ అంబాసిడర్లుగా మారి.. ప్రజాప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడంలో కీలకంగా వ్యవహరించారని చెప్పారు. దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న ఆర్టీసీ(TSRTC) కార్మికుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని చెప్పారు. 11 నెలల 20 రోజుల్లో 115 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యం వినియోగించుకున్నారని అన్నారు. దాదాపు నాలుగువేల కోట్లను ఆర్టీసీ(TSRTC) బదిలీ చేయడంతో నష్టాల్లో ఉన్న సంస్థ ఇప్పుడు లాభాల్లోకి వచ్చిందని అన్నారు. డ్రైవర్లు, కండక్లర్లు ప్రజలతో మమేకమై పనిచేస్తున్నారని కొనియాడారు. మహాలక్ష్మి పథకాన్ని విజయవంతం చేస్తున్నారని అన్నారు.
సన్న వడ్లకు బోనస్
‘వరి వేసుకుంటే ఉరే అని చెప్పిన పెద్ద మనిషి ఫాంహౌస్ ల పడుకున్నాడు. గజ్వేల్ ఫాంహౌస్ లో 150 ఎకరాలలో వరి వేస్తే కావేరిర సీడ్స్ 4,200 క్వింటాలు చొప్పున కొన్నది’ మేం సన్న వడ్లకు బోనస్ ఇస్తున్నం.. క్వింటాకు రూ. 500 చొప్పున ఇస్తుండటంతో రైతులు ఆనందంగా ఉన్నరు. రైతు రుణమాఫీలో అప్పుల ఊబిలో నుంచి బయటికి తీసుకొచ్చాం..’ అని ముఖ్యమంత్రి అన్నారు.

 

Also read :

ChaySho: వైభవంగా చైశో పెళ్లి

ACB: ఏసీబీ వలలో మార్కెటింగ్ ఏడీ