S LBC Tunnel: టన్నెల్ లోకి రోబోటిక్ నిపుణులు

S LBC Tunnel

ఎస్ ఎల్బీసీ టన్నెల్ (S LBC Tunnel) మృతదేహాల కోసం వెతుకులాట ముమ్మరమైంది. 13 రోజుల క్రితం టన్నెల్ లో కూలిపోవడంతో 8 మంది చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వారి కోసం అప్పటి నుంచి అన్వేషణ కొనసాగుతోంది. దేశంలోని అత్యాధునిక టెక్నాలజీని వినియోగించడంతోపాటు నిపుణులను రప్పించి బాధితులను బయటికి రప్పించేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీతో పాటు వివిధ బృందాలు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా నిన్న కేరళ నుంచి వచ్చిన కేడావర్ జాగిలాలు ఇవాళ ఉదయం 7.15 గంటలకు టన్నెల్ (S LBC Tunnel)  లోకి వెళ్లాయి.

Imageబెల్జియం మ్యాల్నోయిస్ బ్రిడ్ కు చెందిన ఈ కేడావర్ శునకాలు15 అడుగుల లోతులో ఉన్న మృతదేహాలను కూడా గుర్తిస్తాయి. మధ్యాహ్నం తర్వాత ఏదో ఒక సమాచారం వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ఉదయం 11.15 గంటల ప్రాంతంలో టన్నెల్ లోకి రోబోటిక్ నిపుణులు వెళ్లారు. వీరి వెంట ఐఐటీ మద్రాస్ ఫ్రొఫెసర్స్ కూడా వెళ్లడం గమనార్హం. రోబోల అవసరం ఏమేరకు ఉంటుందనే అంచనాకు వచ్చిన తర్వాత రోబోల ఆపరేషన్ మొదలవుతుందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా అవసరమైన చోట తవ్వకాలు జరిపేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందంతోపాటు 110 మందిని కూడా తీసుకెళ్లారు.

Image

ఎస్ ఎల్బీసీ టన్నెల్ మృతదేహాల కోసం వెతుకులాట ముమ్మరమైంది. 13 రోజుల క్రితం టన్నెల్ లో కూలిపోవడంతో 8 మంది చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వారి కోసం అప్పటి నుంచి అన్వేషణ కొనసాగుతోంది. దేశంలోని అత్యాధునిక టెక్నాలజీని వినియోగించడంతోపాటు నిపుణులను రప్పించి బాధితులను బయటికి రప్పించేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీతో పాటు వివిధ బృందాలు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా నిన్న కేరళ నుంచి వచ్చిన కేడావర్ జాగిలాలు ఇవాళ ఉదయం 7.15 గంటలకు టన్నెల్ లోకి వెళ్లాయి.

Image బెల్జియం మ్యాల్నోయిస్ బ్రిడ్ కు చెందిన ఈ కేడావర్ శునకాలు15 అడుగుల లోతులో ఉన్న మృతదేహాలను కూడా గుర్తిస్తాయి. మధ్యాహ్నం తర్వాత ఏదో ఒక సమాచారం వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ఉదయం 11.15 గంటల ప్రాంతంలో టన్నెల్ లోకి రోబోటిక్ నిపుణులు వెళ్లారు. వీరి వెంట ఐఐటీ మద్రాస్ ఫ్రొఫెసర్స్ కూడా వెళ్లడం గమనార్హం. రోబోల అవసరం ఏమేరకు ఉంటుందనే అంచనాకు వచ్చిన తర్వాత రోబోల ఆపరేషన్ మొదలవుతుందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా అవసరమైన చోట తవ్వకాలు జరిపేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందంతోపాటు 110 మందిని కూడా తీసుకెళ్లారు.

Image

Aso read: