దీపావళి సందర్భంగా సదర్ (Sadar) సమ్మేళన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని టీపీసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్‌యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. ఈ నెల 27వ తేదీన ధర్నా చౌక్దగ్గర కార్యక్రమాన్ని అట్టహాసంగా చేపడుతామన్నారు. ‘ సమ్మేళన్కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, యూపీ మాజీ సీఎం అఖిలేష్‌యాదవ్, తేజస్వి యాదవ్ లు హాజరవుతారు. యాదవులు, యాదవుతరులు సదర్‌కు (Sadar) వస్తారు. ధనక్ ,ధనక్ అనే స్పెషల్బ్యాండ్తో సదర్ స్టార్ట్ అవుతుంది. కులమతాలకు అతీతంగా సదర్ (Sadar) సమ్మేళన్ ను జరుపుకోవాలని కోరుతున్నం. ఉమ్మడి పది జిల్లాల్లో ఘనంగా అందరూ సదర్ (Sadar) సమ్మేళన్ జరుపుకోవాలి’ అని అంజన్కుమార్యాదవ్అన్నారు.
Also read :
Haryana : హర్యానా సీఎంగా నైని ప్రమాణం
Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

