Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ కు కత్తిపోట్లు

Saif Ali Khan

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) కత్తిపోట్లకు గురయ్యాడు. తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో బాంద్రాలోని ఫార్చూన్ హైట్స్ లోని 11వ అంతస్తులో నివాసం ఉంటున్న ఆయన ఇంట్లోకి ఓ దొంగ ప్రవేశించాడని తెలుస్తోంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఆగంతుకుడి శబ్ధం విన్న కొంతమంది పని మనుషులు నిద్ర నుంచి మేల్కొన్నారు. వాళ్లు అరవడంతో పెనుగులాట జరిగింది.

Imageదీంతో సైఫ్ అలీ ఖాన్ నిద్ర లేచి వచ్చి దొంగను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆగంతకుడు సైఫ్ పై దాడి చేశాడు. మొత్తం ఆరు చోట్ల కత్తితో పొడిచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ సైఫ్ అలీఖాన్ ను సిబ్బంది హుటాహుటిన ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు. ఆరు కత్తిపోట్ల గాయాల్లో రెండు లోతుగా ఉన్నాయని, అవి వెన్నెముక భాగంలో ఉన్నాయని తెలిపారు.

Image సైఫ్‌కు3.30గంటల న్యూరో సర్జరీ జరిగిందని లీలావతి హాస్పిటల్ సిఓఓ డాక్టర్ నీరజ్ ఉత్తమని తెలిపారు. సైఫ్ గాయాలకు 10 కుట్లు వేసినట్టు తెలిపారు. న్యూరోసర్జన్ డాక్టర్ నితిన్ డాంగే, కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ లీనా జైన్, అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ నిషా గాంధీ నేతృత్వంలోని వైద్యుల బృందం సర్జరీ చేసినట్టు వివరించారు.

Image

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కత్తిపోట్లకు గురయ్యాడు. తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో బాంద్రాలోని ఫార్చూన్ హైట్స్ లోని 11వ అంతస్తులో నివాసం ఉంటున్న ఆయన ఇంట్లోకి ఓ దొంగ ప్రవేశించాడని తెలుస్తోంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఆగంతుకుడి శబ్ధం విన్న కొంతమంది పని మనుషులు నిద్ర నుంచి మేల్కొన్నారు. వాళ్లు అరవడంతో పెనుగులాట జరిగింది.

Also read;