బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ (Salman Khan)ఇంటి వద్ద కాల్పుల కేసులో నిందితుడు కస్టడీలోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబైలో సల్మాన్ ఖాన్ (Salman Khan)ఇటీవలు కాల్పులు చోటుచేసుకోవడం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసు క్రైమ్ బ్రాంచ్ అధికారులు కొంతమంది నిందితులను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. వీరిలో ఒకడైన అనూజ్ ఇవాళ ఉదయం బాత్రూమ్‌కు వెళ్లి బెడ్‌షీట్‌తో ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన అధికారులు వెంటనే అతడిని సమీపంలోని దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ అతడు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. పంజాబ్‌కు చెందిన 23 ఏళ్ల అనూజ్‌ను ఏప్రిల్ 26న పోలీసులు అరెస్టు చేశారు.
Also read :
Delhi : డీప్ ఫేక్స్ వ్యాప్తిని ఆపండి
Telangana :లోక్ సభ బరిలో సామాన్యులు!

