హైదరాబాద్: పదోతరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ (BANDI SANJAY)కి హన్మకొండ ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. ఏప్రిల్ 19 వరకు బండి సంజయ్ (BANDI SANJAY) రిమాండ్ లో ఉంటారు. బండి సంజయ్ ని ఖమ్మం సబ్ జైలుకి తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. బండి సంజయ్ తో పాటు మరో ముగ్గురు నిందితులను ఖమ్మం జైలుకి తరలించనున్నారు. కస్టడీ పిటిషన్ పై వాదనల సందర్భంగా బండి సంజయ్ అరెస్ట్ అక్రమమని ఆయన తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు బండి సంజయ్ కి రెండు వారాల రిమాండ్ విధించారు. కోర్టు రిమాండ్ పై నిర్ణయం తీసుకోవడంతో బండి సంజయ్ తరపున న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
హన్మకొండ కోర్టు దగ్గర టెన్షన్ టెన్షన్..
హన్మకొండ కోర్టు దగ్గరకు బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండటంతో కోర్టు దగ్గర పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. పోటాపోటీగా నినాదాలు చేసేందుకు యత్నించగా వారిని పోలీసులు అడ్డుకొన్నారు.
ఏ1గా బండి సంజయ్..
టెన్త్ పేపర్ లీక్ కేసు రిమాండ్ రిపోర్టులో బండి సంజయ్‌ను ఏ1గా చేర్చారు. ఏ2గా ప్రశాంత్, ఏ3గా మహేశ్, ఏ4గా మైనర్ బాలుడు, ఏ5గా మోతం శివగణేశ్, ఏ6గా పోగు సురేశ్, ఏ7గా పోగు శశాంక్, ఏ8గా దూలం శ్రీకాంత్, ఏ9గా పెరుమాండ్ల శార్మిక్, ఏ10గా పోతబోయిన వసంత్ పేర్లను చేర్చారు. బయటకు వచ్చిన పేపర్ ఫోటోను బండి సంజయ్ సహా ఈటల రాజేందర్ పీఏ, ఇతరులు చాలామందికి పంపారని సీపీ రంగనాథ్ చెప్పారు. పేపర్ ను ప్లాన్ ప్రకారమే షేర్ చేస్తున్నారని తెలిపారు.
ఫోన్ ఇవ్వని బండి సంజయ్..
బండి సంజయ్ తమకు ఫోన్ ఇస్తే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయని, కానీ ఆయన ఇవ్వడం లేదన్నారు సీపీ. బండి సంజయ్, ప్రశాంత్ మధ్య పలు కాల్స్, చాట్స్ జరిగినట్లుగా సీపీ తెలిపారు. బండి సంజయ్ డైరక్షన్ లోనే ఇదంతా జరిగిందని ఆయన తెలిపారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్ర జరిగిందన్నారు. బండి సంజయ్ అరెస్టుపై లోక్‌సభ స్పీకర్‌కు సమాచారం ఇచ్చినట్లు సీపీ రంగనాథ్ తెలిపారు. ఈ కేసులో మొత్తం 10 మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇందులో నలుగురిని అరెస్టు చేసి రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
టెన్త్ పేపర్ లీక్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. వరంగల్ సీపీ రంగనాథ్ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌లో బండి సంజయ్‌ను ఏ1గా చేర్చారు. ఏ2గా ప్రశాంత్, ఏ3గా మహేశ్, ఏ4గా మైనర్ బాలుడు, ఏ5గా మోతం శివగణేశ్, ఏ6గా పోగు సురేశ్, ఏ7గా పోగు శశాంక్, ఏ8గా దూలం శ్రీకాంత్, ఏ9గా పెరుమాండ్ల శార్మిక్, ఏ10గా పోతబోయిన వసంత్ పేర్లను చేర్చారు.
వాట్సాప్ చాట్ లో ఏముందంటే..?
బండి సంజయ్, ప్రశాంత్ మధ్య పలు కాల్స్, చాట్స్ జరిగినట్లుగా సీపీ తెలిపారు. బండి సంజయ్ డైరక్షన్ లోనే ఇదంతా జరిగిందని ఆయన తెలిపారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్ర జరిగిందని సీపీ రంగనాథ్ తెలిపారు. బండి సంజయ్ అరెస్టుపై లోక్‌సభ స్పీకర్‌కు సమాచారం ఇచ్చినట్లు వరంగల్ సీపీ రంగనాథ్ తెలిపారు. ఈ కేసులో మొత్తం 10 మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇందులో నలుగురిని అరెస్టు చేసి రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. నిందితుడు బూర ప్రశాంత్ గతంలో జర్నలిస్టుగా పనిచేశాడని, ప్రస్తుతం అతనికి ఏ మీడియా సంస్థతో సంబంధం లేదని సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. బయటకు వచ్చిన పేపర్ ఫోటోను బండి సంజయ్ సహా ఈటల రాజేందర్ పీఏ, ఇతరలు చాలామందికి పంపారని సీపీ రంగనాథ్ చెప్పారు. పేపర్ ను ప్లాన్ ప్రకారమే షేర్ చేస్తున్నారని తెలిపారు. బండి సంజయ్ తమకు ఫోన్ ఇస్తే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయని, కానీ ఆయన ఇవ్వడం లేదన్నారు.
Also Read
REVANTH REDDY, BANDI SANJAY: రేవంత్, బండికి లీగల్ నోటీసులు!
FACEBOOK BLUE TICK: బ్లూ టిక్ చాలా కాస్ట్లీ గురూ..!

