SC :నీట్ పై సుప్రీం సీరియస్.

నీట్‌ పరీక్షను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో(SC) విచారణ జరిగింది. ఈ సందర్భంగా నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ)పై ధర్మాసనం సీరియస్​అయ్యింది. ఎక్కడైనా 0.001 శాతం నిర్లక్ష్యం ఉన్నా.. దాన్ని సకాలంలో పరిష్కరించాలని జస్టిస్‌ విక్రమనాథ్‌, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టీలతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది. ‘పరీక్ష నిర్వహిస్తున్న ఏజెన్సీ న్యాయంగా వ్యవహరించాలి. ఏదైనా తప్పిదం జరిగితే.. తప్పు జరిగిందని అంగీకరించి సరిదిద్దాలి. ఈ చర్యలు తీసుకోనున్నాం అని వివరించాలి. కనీసం అదైనా మీ పనితీరుపై విశ్వాసం కలిగిస్తుంది. విద్యార్థుల కష్టాన్ని మర్చిపోకూడదు. వ్యవస్థను మోసం చేసే వ్యక్తి వైద్యుడైతే.. సమాజానికి ఎంత హానికరమో ఆలోచించాలి’ వ్యాఖ్యానించింది. నీట్‌ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని వస్తున్న ఆరోపణలపై రెండు వారాల్లో సమాధానం చెప్పాలని కేంద్రం, ఎన్టీఏకి తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను జులై 8కి వాయిదా వేసింది.(SC)

ALSO READ :