Wayanad: వయనాడ్ లో మృత్యుంజయుల అన్వేషణ

Wayanad

(Wayanad)  వయనాడ్   చరియలు విరిగి పడిన ఘటనలో మృత్యుంజయుల కోసం అన్వేషన్ కొనసాగుతోంది. ప్రాణాలతో ఉన్నవారిని గుర్తించేందుకు డ్రోన్ ఆధారిత రాడార్ సాంకేతికతను వాడుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్ లో ఇప్పటి వరకు సహాయక బృందాలు దాదాపు వెయ్యి మందిని కాపాడాయి.Image ఈ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 308 మంది చనిపోయారు. కూలిపోయిన భవనాలు, శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయకచర్యలు కొనసాగుతోన్నాయి. నాలుగో రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరో 200 మందికి గాయలవ్వగా వారందరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆర్మీ, ఎన్‌డిఆర్‌ఎఫ్, కోస్ట్ గార్డ్, నేవీతో కూడిన సంయుక్త బృందం సహాయకచర్యలు కొనసాగిస్తోంది. నలభై బృందాలుగా ఏర్పడి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.Image చలియార్ నది పరిధిలోని 8 పోలీస్ స్టేషన్లలోని సిబ్బంది, గజఈతగాళ్లు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.కేరళకు రెడ్ అలెర్ట్రాబోయే రెండు రోజుల్లో  (Wayanad)  వయనాడ్  సహా ఇతర జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇడుక్కి, త్రిసూర్, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, కాసర్‌గోడ్ జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది.

(Wayanad)  వయనాడ్   చరియలు విరిగి పడిన ఘటనలో మృత్యుంజయుల కోసం అన్వేషన్ కొనసాగుతోంది. ప్రాణాలతో ఉన్నవారిని గుర్తించేందుకు డ్రోన్ ఆధారిత రాడార్ సాంకేతికతను వాడుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్ లో ఇప్పటి వరకు సహాయక బృందాలు దాదాపు వెయ్యి మందిని కాపాడాయి.ఈ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 308 మంది చనిపోయారు. కూలిపోయిన భవనాలు, శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయకచర్యలు కొనసాగుతోన్నాయి. నాలుగో రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరో 200 మందికి గాయలవ్వగా వారందరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆర్మీ, ఎన్‌డిఆర్‌ఎఫ్, కోస్ట్ గార్డ్, నేవీతో కూడిన సంయుక్త బృందం సహాయకచర్యలు కొనసాగిస్తోంది. నలభై బృందాలుగా ఏర్పడి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు

Also read: