Seethakka: అమ్మాయిల వైపు చూడాలంటేనే భయపడేలా చేస్తం

seethakka

అమ్మాయిల వైపు చూడాలంటేనే మానవ మృగాలు భయపడేలా చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క (Seethakka)  అన్నారు. నాగర్​కర్నూల్​ జిల్లాలో ఇటీవల అమానుష దాడికి గురై నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత చెంచు మహిళను మంత్రి సీతక్క (Seethakka)  పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునే అమానుష ఘటన ఇది అని అన్నారు. కొందరు మృగాళ్లు చెంచు మహిళపై దారుణంగా దాడికి పాల్పడ్డారన్నారు. దాడి ఘటన వెలుగులోకి రాగానే బాధితురాలికి ప్రభుత్వం బాసటగా నిలిచిందన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండ‌గా ఉంటుందన్నారు. నిందితుల‌కు క‌ఠిన శిక్ష ప‌డేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఆదేశించామన్నారు. బాధితురాలి మామ మరణంపై కూడా అనుమానాలు ఉండడంతో ఆ కేస్ ను పునర్విచారణ చేయాలని పోలీసులను కోరామన్నారు. ఫ్యూడల్ భావజాలంతో చెంచుల భూములను లాక్కునే కుట్రతోనే వారి మీద దౌర్జన్యాలు చేస్తున్నారన్నారు. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అమ్మాయిలను, మహిళలపై దాడులకు దిగే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామన్నారు.

Image

ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునే అమానుష ఘటన ఇది అని అన్నారు. కొందరు మృగాళ్లు చెంచు మహిళపై దారుణంగా దాడికి పాల్పడ్డారన్నారు. దాడి ఘటన వెలుగులోకి రాగానే బాధితురాలికి ప్రభుత్వం బాసటగా నిలిచిందన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండ‌గా ఉంటుందన్నారు. నిందితుల‌కు క‌ఠిన శిక్ష ప‌డేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఆదేశించామన్నారు. బాధితురాలి మామ మరణంపై కూడా అనుమానాలు ఉండడంతో ఆ కేస్ ను పునర్విచారణ చేయాలని పోలీసులను కోరామన్నారు. ఫ్యూడల్ భావజాలంతో చెంచుల భూములను లాక్కునే కుట్రతోనే వారి మీద దౌర్జన్యాలు చేస్తున్నారన్నారు. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అమ్మాయిలను, మహిళలపై దాడులకు దిగే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామన్నారు.

Also read: