స్పోర్ట్: ఆసీస్ స్టార్ బ్యాట్స్మన్ షాన్ మార్ష్ (SHAUN MARSH)రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ తో పాటు అంతర్జాతీయ వన్డేల నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపాడు. ఇకపై టీ20 మ్యాచ్ లలోనే కొనసాగుతానని స్పష్టం చేశాడు. షాన్ మార్ష్ 2019లోనే టెస్టులకు గుడ్ బై చెప్పిన విషయం పాఠకులకు విదితమే.
236 మ్యాచుల్లో 12,811 పరుగులు
2001లో 17వ ఏట షాన్ మార్ష్.. వెస్ట్రన్ ఆస్ట్రేలియా తరపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 236 మ్యాచుల్లో 12,811 పరుగులు చేశాడు. ఇందులో 32 సెంచరీలు సాధించాడు. 2022లో షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీని వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు మార్ష్ అందించాడు. లిస్ట్-ఏ కెరీర్‌లో 177 మ్యాచ్‌లు ఆడిన మార్ష్.. 44.45 సగటుతో 7,158 పరుగులు చేశాడు.
2008లో వన్డేల్లోకి ఎంట్రీ
2008లో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్నిన (SHAUN MARSH)షాన్ మార్ష్..ఇప్పటి వరకు 73 వన్డేలు ఆడి..40.77 సగటుతో 2773 పరుగులు సాధించాడు. ఇందులో 7 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలున్నాయి. 2011లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చిన షాన్ మార్ష్..మొత్తం 38 టెస్టుల్లో 34.31 సగటుతో 2,265 పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలున్నాయి. 2008లోనే విండీస్ తో జరిగిన మ్యాచ్ ద్వారా టీ20ల్లోకి అరంగేట్రం చేశాడు. మొత్తంగా ఇప్పటి వరకు 15 టీ20లలో 18.21 సగటుతో 255 పరుగులు మాత్రమే చేశాడు.
also read:
- VIRUSHKA:ఉజ్జయినిలో విరుష్క పూజలు
- WPL2023: తొలి పోరులో ముంబై గ్రాండ్ విక్టరీ
- Sachin Tendulkar : నిన్ను ఎంతో మిస్ అవుతున్నా..