Donald Trump: ట్రంప్ కు కోర్టులో షాక్

Donald Trump

పౌరసత్వాన్ని రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీసుకున్న నిర్ణయంపై సీటెల్ డిస్ట్రిక్ట్ స్టే విధించింది. ఈ నిర్ణయం అమెరికా రాజ్యాంగానికి విరుద్ధమని పేర్కొంటూ ఇవాళ తీర్పు చెప్పింది. కోర్టు నిర్ణయం వేలాది మంది వలసదారులకు పెద్ద ఉపశమనం కలిగించింది. అమెరికాలో దశాబ్దాలుగా ఉన్న జన్మతహా వచ్చే పౌరసత్వపు హక్కును రద్దు చేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అధ్యక్షుడి హోదాలో (Donald Trump) ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వును జారీ చేశారు. వీటిని అమలు చేయకుండా ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి ఇవాళ స్టే ఇచ్చారు. వాషింగ్టన్, అరిజోనా, ఇల్లినాయిస్ , ఒరెగాన్ రాష్ట్రాల అభ్యర్థన మేరకు అమెరికాలోని సీటెల్ జిల్లా న్యాయమూర్తి జాన్ కోగ్‌నూర్ తాత్కాలిక నిషేధ ఉత్తర్వును జారీ చేశారు.

Imageట్రంప్ తీసుకున్న నిర్ణయంపై 22 రాష్ట్రాల్లో ఆందోళనలు వెల్లువెత్తాయి. మరోవైపు జన్మత: పౌరసత్వంపై అమెరికాలో ఉన్న భారతీయుల్లో ఆందోళన మొదలైంది. కొందరైతే నెలలు నిండకుండా పిల్లలను కనేందుకు సిద్ధమయ్యారు. ఒక్క భారతీయులే కాదు వివిధ దేశాలకు చెందిన అమెరికాలో సెటిల్ అయిన వారంతా ట్రంప్ నిర్ణయంలో ఇబ్బందుల్లో పడ్డారు. సీటెల్ జిల్లా కోర్టు తీర్పుపై సీటెల్ జిల్లా కోర్టు తీర్పుపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. పైకోర్టు అప్పీల్ చేస్తామని ప్రకటించారు.  స్పందించారు. ఈ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. పైకోర్టు అప్పీల్ చేస్తామని ప్రకటించారు.

Image

1868 నుంచి అమలు
1868లో 14వ సవరణ ప్రకారం జన్మహక్కు పౌరసత్వం అమలులో ఉంది. అమెరికాలో అంతర్యద్దం తర్వాత ఆఫ్రికన్ అమెరికన్లకు పౌరసత్వాన్నిస్తూ ఈ చట్టం ఆమోదించారు. దీని ప్రకారం.. యూనైటెడ్ స్టేట్స్ లో జన్మించిన వ్యక్తులు లేదా అక్కడుండేవారు అమెరికా పౌరులే. అయితే ప్రస్తుత ట్రంప్ ఉత్వర్వుల ప్రకారం.. పౌరులు కానీ వారికి పుట్టే పిల్లలకు పౌరసత్వం వర్తించదు.
ట్రంప్ ఆర్డర్ గనక అమలు అయితే.. ఏటా లక్షా 50వేల మంది నవజాత శిశువులు పౌరసత్వాన్ని కోల్పోతారు.

Image

Also read: