Dilwala : ఏప్రిల్‌‌‌‌లో ‘దిల్ వాలా’..!

Dilwala

Dilwala : నరేష్​ అగస్త్య, శ్వేత అవస్తి జంటగా నటిస్తున్న చిత్రం ‘దిల్ వాలా’. వీరభద్రమ్ చౌదరి దర్శకుడు. నబీషేక్, తూము నర్సింహ పటేల్ నిర్మిస్తున్నారు. క్రైమ్ కామెడీ జానర్‌‌‌‌‌‌‌‌లో తెరకెక్కుతోంది. వైజాగ్‌‌‌‌లో కంటిన్యూస్‌‌‌‌గా 20 రోజుల షూటింగ్‌‌‌‌ చేసిన టీమ్ ఆదివారంతో టాకీ పార్ట్ పూర్తి చేశారు. ఈ షెడ్యూల్‌‌‌‌లో హీరో హీరోయిన్‌‌‌‌తో పాటు రాజేంద్ర ప్రసాద్, ప్రగ్యా నైనా, అలీ రెజా పాల్గొన్నారు. దీంతో 95 శాతం షూటింగ్ పూర్తయిందని, మరో రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయని చెప్పారు మేకర్స్. ఈ రెండు పాటలని బ్యాంకాక్‌‌‌‌లో ప్లాన్ చేశారు. మార్చిలో పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకొని ఏప్రిల్‌‌‌‌లో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నామన్నారు.