మహారాష్ట్రలోని ప్రసిద్ధ (Siddhivinayak) Templeలో చోరీ ఘటన వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. భక్తుల నుంచి వచ్చే హుండీ డబ్బును ఆలయ సిబ్బందే దోచుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం, హుండీలను ఒక గది నుంచి మరో గదికి తరలించే సమయంలో సిబ్బంది చాకచక్యంగా నోట్లను మెల్లిగా తీసి దాచుకున్నట్లు గుర్తించారు. ఈ ప్రక్రియను చాలా జాగ్రత్తగా నిర్వహించడంతో ప్రారంభంలో ఎవరికి అనుమానం రాలేదు.

ఈ చోరీ వ్యవహారం దాదాపు రెండు నెలల పాటు కొనసాగినట్లు పోలీసులు తెలిపారు. ( Siddhivinayak) ఆలయ ట్రస్ట్‌కు అనుమానం రావడంతో వెంటనే ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు సీసీటీవీ ఫుటేజీ, ఇతర ఆధారాల ఆధారంగా ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.80 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో కొందరిని పోలీస్ కస్టడీలో ఉంచి విచారణ కొనసాగిస్తుండగా, మరికొందరిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ చోరీలో ఇంకా ఇతర సిబ్బంది ప్రమేయం ఉందా? మొత్తం ఎంత మొత్తాన్ని దోచుకున్నారన్న విషయాలను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ సంఘటనతో భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆలయాల వంటి పవిత్ర ప్రదేశాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తంగా ఈ కేసు ఆలయ నిర్వహణలో పారదర్శకత, భద్రతా చర్యలు మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేస్తోంది.
Also read: