నేను శైలజ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ (Keerthy Suresh) తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఫస్ట్ మూవీ హిట్ కావడంతో వరుస ఆఫర్లతో బిజీ అయింది ఈ బ్యూటీ. ఇక నేను లోకల్, మహానటి, దసరా మూవీతో ఓ రేంజ్ లో ఎదిగిపోయింది. ప్రస్తుతం రెండు, మూడు సినిమాలతో బిజీబిజీగా ఉంది.
త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతోంది. అయితే తాజాగా కల్కి మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. కల్కి 2898 ఏడీ మూవీలో తనను (Keerthy Suresh) అడిగిన క్యారెక్టర్ ను కాదనుకున్నా.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎలాగైనా తనను సినిమాలో నన్ను తీసుకుంటానన్నాడు.
)
బుజ్జికి వాయిస్ ఓవర్ చెప్పడం వల్ల ప్రత్యేకంగా ఉంటుందని భావించి, నాగ్ అశ్విన్ అడిగిన వెంటనే ఓకే చెప్పాను.

సినిమా రిలీజ్ తర్వాత బుజ్జి కారుకు తన (Keerthy Suresh) వాయిస్ ప్లస్ అయింది అని చెప్పడంతో చాలా హ్యాపీ అనిపించిందని చెప్పుకొచ్చింది.
Also read :
Africa: ఫుట్ బాల్ మ్యాచ్ లో వివాదం 100 మంది మృతి
Harsh Bardan: ఉద్యోగంలో చేరేందుకు బయల్దేరి మృతి

