సింగరేణి (Singareni) బొగ్గు సంస్థ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం భారీ బోనస్ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 400 కోట్ల బోనస్లో భాగంగా, ఒక్కో కార్మికుడి ఖాతాలో ₹1.03 లక్షలు ఇవాళ జమ కానున్నట్లు (Singareni) కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు.
దీపావళి పండుగ సందర్భంగా సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మాట్లాడుతూ ఆయన అన్నారు – “భవిష్యత్తులో మరిన్ని బొగ్గు గనులు తెరవడం ద్వారా ఉత్పత్తి, ఉద్యోగావకాశాలు రెండూ పెరుగుతాయి. సింగరేణి ప్రాంతాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయి” అని చెప్పారు.
అలాగే దసరా పండుగకు ముందు ఒక్కో కార్మికుడికి ₹2 లక్షల లాభాల వాటా పంపిణీ చేసినట్లు గుర్తుచేశారు. కార్మికులు, ఉద్యోగులు, అధికారులు కష్టపడి పని చేయడం వల్లే బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు చేరుకుంటున్నామని మంత్రి అభినందనలు తెలిపారు.
సింగరేణి సంస్థ మనుగడ కొత్త బొగ్గు గనుల తవ్వకాలపై ఆధారపడి ఉందని, త్వరలో మరిన్ని గనులు ప్రారంభం కానున్నాయని ఆయన వెల్లడించారు. తెలంగాణలోనే సింగరేణి బెస్ట్ కోల్ ఇండస్ట్రీగా నిలుస్తుంది అని మంత్రి గడ్డం వివేక్ అన్నారు.
సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 400 కోట్ల బోనస్ ప్రకటించిందని, ఇవాళ ఒక్కో కార్మికుడి ఖాతాలో లక్షా 3 వేల రూపాయలు జమ అవుతాయని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. భవిష్యత్తులో మరిన్ని గనులు తీసుకొచ్చి బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను మరింతగా పెంచాలన్నారు. దీపావళి పండుగ సందర్భంగా ఆయన ప్రజలకు, సింగరేణి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మాట్లాడుతూ.. కొత్త బొగ్గు గనుల తవ్వకాలతో కొత్త ఉద్యోగాలు లభించడంతో పాటు సింగరేణి ప్రాంతాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాయన్నారు. సింగరేణి సంస్థ మనుగడ కొత్త బొగ్గు గనులపై ఆధారపడి ఉందని చెప్పారు. దసరా పండుగ ముందు ఒక్కో కార్మికుడికి రెండు లక్షల చొప్పున లాభాల వాటా పంపిణీ చేసినట్లు చెప్పిన మంత్రి..
కార్మికులు, ఉద్యోగులు, ఆఫీసర్లు కష్టపడి బొగ్గు ఉత్పత్తి, ఉత్పదకతా లక్ష్య సాధనకు కృషి చేస్తున్నందుకు అభినందనలు తెలిపారు. కొత్త బొగ్గు గనులు తవ్వకాల వల్ల కొత్త ఉద్యోగాలు లభించడంతో పాటు సింగరేణి ప్రాంతాలు అన్ని విధాల అభివృద్ది చెందుతాయన్నారు. తెలంగాణలోనే బెస్ట్ కోల్ ఇండస్ర్టీగా సింగరేణి నిలుస్తుంద ని చెప్పారు.
Also read:

