సిరిసిల్లలో (Siricilla)హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రోటోకాల్ వివాదం పై రోజురోజుకు తీవ్ర రగడ రాజుకుంది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫోటో పెట్టాల్సిందేనని, లేకపోతే అధికారిక కార్యక్రమాలను అడ్డుకుంటామని బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో సవాలు విసిరాడు.

స్పందించిన కాంగ్రెస్ నేతల సిరిసిల్ల క్యాంప్ కార్యాలయంలో సీఎం ఫోటో పెడతామని సవాలు విసిరాడు.ఈ నేపథ్యంలో ఇవాళ కేటీఆర్ క్యాంపు కార్యాలయానికి సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడానికి కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

అదే సమయంలో బీఆర్ఎస్ నాయకులు కూడా క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ముందే క్యాంపు కార్యాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఇరువర్గాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నేతల పై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఇరు పార్టీల నేతలను అరెస్టు చేసి పీఎస్ తరలించారు. పట్టణంలో(Siricilla) ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతుంది.
Also read :
Rave party : బెంగళూరులో రేవ్ పార్టీ భగ్నం
PM Modi : మహిళల జోలికొస్తే ఊరుకుంటామా?

