టీజీపీఎస్సీ (TGPSC) గ్రూప్–1 మెయిన్ పరీక్షలు అక్టోబర్ 21 నుంచి 27 వరకు కొనసాగనున్నాయి ఉన్నాయి. హైదరాబాద్ లోని పలు కేంద్రాలను కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి పరిశీలించారు. ఇదిలా ఉండగా గ్రూప్ –1 వాయిదా వేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. కాసేపట్లో సర్వోన్నత న్యాయస్థానం విచారించనుంది.
కాసేపట్లో పరీక్షలు స్టార్ట్ (TGPSC)
మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ పరీక్షలకు అధికారులు పూర్తి స్థాయి ఏర్పాటు చేశారు. ఒకపక్క ఈ పరీక్షలను వాయిదా వేయాలని ఆందోళనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ పరిస్థితి ఏర్పడింది.
ఈ పరీక్షలకు 31, 383 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు 46 పరీక్ష కేంద్రాలు (హైదరాబాద్ జిల్లాలో 8, రంగారెడ్డి జిల్లాలో 11, మేడ్చల్ జిల్లాలో 27) ఏర్పాటు చేశారు. ఈ పరీక్షల నిర్వహణకు జిల్లా కలెక్టర్లు నేరుగా పర్యవేక్షించనున్నారు పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవకతవకలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్ష హాలు, చీఫ్ సూపరింటెండెంట్ రూమ్, పరిసర ప్రాంతాలలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నుంచి ఉన్నతాధికారులు పర్యావేక్షించనున్నారు. అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి కనీసం 30 నిమిషాల ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుందని అధికారులు ప్రకటించారు. పరీక్షా కేంద్రంలోకి మధ్యాహ్నం నుంచి 1.30 గంట వరకు అనుమతిస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాత వచ్చే వారిని అనుమతించబోమని స్పష్టం చేశారు పరీక్షలకు సంబంధించి ఏమైనా అనుమానాలు ఉంటే 040-23452185, 040-23452186, 040-2345 రెండు ఒకటి ఎనిమిది ఏడు నంబర్లలో కానీ, ఈమెయిల్ ద్వారా కానీ సంప్రదించవచ్చని అధికారులు సూచించారు.
దివ్యాంగులు గంట సమయం అదనంగా కేటాయిస్తున్నారు. సహాయకుల సాయంతో పరీక్షలు రాసే వారికి ప్రత్యేకంగా నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు, పరీక్ష హాళ్లలో గోడ గడియారాలు ఏర్పాటు చేస్తున్నారు. మెయిన్స్ లో అభ్యర్థులు అన్నీ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ ముగిసే వరకు అభ్యర్థులు తమ హాల్ టికెట్, ప్రశ్నా పత్రాలు భద్రపరుచుకోవాల్సి ఉంటుంది. 563 గ్రూప్-1 పోస్టులను భర్తీలో భాగంగా.. ఇప్పటికే ప్రిలిమనరీ పరీక్షలు పూర్తి చేసి, మెయిన్స్ కోసం అభ్యర్థులను ఎంపిక చేశారు. ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున అభ్యర్థులు మెయిన్స్ రాయనున్నారు.
గ్రూప్ -1 మెయిన్ పరీక్షల షెడ్యూల్
పరీక్ష పేరు తేది
జనరల్ ఇంగ్లీష్ (క్వాలిఫై టెస్ట్)
పేపర్ వన్ జనరల్ ఎస్సే 21-10-2024
పేపర్ టు చరిత్ర, సంస్కృతి, భౌగోళిక శాస్త్రం 22-10-2024
పేపర్ 3 భారతీయ సమాజం, రాజ్యాంగం, పాలన 24-10-2024
పేపర్ ఫోర్ ఆర్ధిక శాస్త్రం, అభివృద్ధి 25-10-2024
పేపర్ -5 సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్ ప్రిటేషన్ 26-10-2024
పేపర్ ఆరు తెలంగాణ ఉద్యమ, రాష్ట్ర ఆవిర్భావం 27-10-2024
Also read:

