భారత్ తో పాటు 97 దేశాల్లోని ఐ ఫోన్ (iphone) వినియోగదారులకు యాపిల్ కంపెనీ అలెర్ట్ జారీ చేసింది. మీ ఫోన్లలో కొత్త వైరస్ ఎటాక్ జరిగే ప్రమాదం ఉందంటూ హెచ్చరికలు జారీ చేసింది. అది పెగాసస్ లాంటి స్పైవేర్ అని కూడా సూచించింది దీని వల్ల మీ డేటాకు, సమాచారం భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని తెలిపింది. పటిష్ఠమైన భద్రత కలిగిన ఐవోఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ను కూడా పెగాసెస్ లాంటి మెర్సినరీ స్పైవేర్ అటాక్ చేయగలదని సమాచారం. జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ, సంవృద్ధ్ భారత్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పుష్పరాజ్ దేశ్‌పాండే మైక్రోబ్లాగింగ్ సైట్ ఫోన్లకు ఈ అలెర్ట్ వచ్చింది. ఈ వాళ్లు ఎక్స్ వేదికగా షేర్ చేశారు. మెర్సినరీ స్పైవేర్ చాలా ప్రమాదరమైనది. అత్యాధునికమైనదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మెర్సినరీ స్పైవేర్ అటాక్ సైబర్ క్రిమినల్ యాక్టివిటీ లేదా కన్స్యూమర్ మాల్‌వేర్ కంటే చాలా అధునాతనమైనదని చెబుతున్నారు. మెర్సినరీ స్పైవేర్ డివైస్ లోని మీ మొత్తం డేటా, కార్యకలాపాలను హ్యాక్ చేసే హ్యాకర్స్ చేతిలో పెడుతుంది. ఇండియాలో ఇప్పటి వరకు ఎంతమందికి ఈ అలెర్ట్ మెస్సెజ్ లు వచ్చాయో స్పష్టంగా తెలియదు.
Also read :
Chandrababu : ఏపీకి చమురుశుద్ధి కర్మాగారం!
Bharathiyudu-2 : భారతీయుడు–2 టికెట్ల రేట్లు భగభగ

