SREE LEELA :సంక్రాంతికి శ్రీలీల రచ్చ

సామజవరగమన ఫేమ్ భాను భోగవరపు దర్శకత్వంలో మాస్ మహరాజా రవితేజా, శ్రీలీల(SREE LEELA) హీరోయిన్లుగా కొత్త సినిమా రానుంది. ఇది రవితేజ హీరోగా 75 వ చిత్రం. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాయి, ప్రస్తుతం ఈ మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇప్పటికే శ్రీలీల రవితేజకి జోడీగా ధమాకా మూవీలో నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. రవితేజ ఎనర్జీ లెవల్స్ ని మ్యాచ్ చేస్తూ శ్రీలీల(SREE LEELA) ధమాకా చిత్రంలో నటించింది. ప్రస్తుతం రవితేజ 75 మూవీ కూడా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ గానే తెరకెక్కనుందట. రవితేజ ఎనర్జీని అందుకోవాలంటే శ్రీలీల కరెక్ట్ చాయిస్ అని ఆమెని ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది, ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని సితార ఎంటర్టైన్మెంట్స్ భావిస్తోంది. ఇప్పటికే సంక్రాంతి రేసులో అరడజను సినిమాలు ఉన్నాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర, ప్రభాస్ రాజాసాబ్, వెంకటేశ్ అనిల్ రావిపూడి మూవీ, నాగార్జున బంగార్రాజు 2 ఇంచుమించు బెర్త్ ఖరారు చేసుకున్నాయి, అలాగే అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ కూడా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇవి కాకుండా మరికొన్ని సినిమాలు కూడా సంక్రాంతి రిలీజ్ డేట్ కోసం పోటీలో ఉన్నాయి.ఇంత టైట్ ఫైట్ మధ్యలో రవితేజ సినిమాని కూడా సంక్రాంతి రేసులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తూ ఉండటం ఆసక్తికరంగా మారింది. 2024లో సితార వారి మెయిన్ బ్యానర్ అయిన హారికా హాసిని నుంచి గుంటూరు కారం సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది కూడా పోటీలో ఉండాలని రవితేజ సినిమాతో రావడానికి ప్రయత్నిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ALSO READ :