చేతినిండా సినిమాలతో దూసుకెళ్తున్నారు నటి శ్రీలీల(Sreeleela) ఎంబీబీఎస్ చదువుతూనే మరోవైపు టాప్ హీరోల సరసన నటిస్తోంది. తన తదుపరి చిత్రం ‘ఆదికేశవ’ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన మనో భావాలను పంచుకుంది. మెడిసిన్ పూర్తిచేయడమే తన టాప్ ప్రయార్టీ అని చెప్పింది. ‘‘డాక్టర్ కావాలని చిన్నప్పటి నుంచి కలలు కన్నా. నేను తప్పకుండా డాక్టర్ అవుతా. ఇంట్లో వాళ్లకు మాటిచ్చా. నటిగా ఉంటూనే ఎంబీబీఎస్ పూర్తి చేసేందుకూ సిద్ధం అవుతున్నా. నటిగా ప్రేక్షకులను అలరించటాన్ని, వాళ్ల ప్రేమాభిమానాలు పొందటాన్ని అదృష్టంగా భావిస్తున్నా. డాక్టర్ కావడం నా ఫస్ట్ ప్రయార్టీ. నా అభిప్రాయం ప్రకారం.. ప్రతి అమ్మాయికీ వృత్తిపరంగా అలాంటి బ్యాకప్ తప్పక ఉండాలి. నటిగా నా అభినయంతో.. లేదంటే వైద్యురాలిగా చికిత్స అందించడం ద్వారా ప్రజల స్వాంతన ఇవ్వాలనుకుంటున్నా’’ అంటోంది శ్రీలీల(Sreeleela).నటిగా నా అభినయంతో.. లేదంటే వైద్యురాలిగా చికిత్స అందించడం ద్వారా ప్రజల స్వాంతన ఇవ్వాలనుకుంటున్నా’’ అంటోంది శ్రీలీల(Sreeleela).
Read More:

