Srinagar: శ్రీనగర్ లో మళ్లీ పేలుళ్లు 

Srinagar

దాల్ సరస్సులో పడ్డ క్షిపణి భారత్–పాక్ ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇవాళ ఉదయం 11.45 గంటలకు (Srinagar) శ్రీనగర్ లో రెండు భారీ పేలుళ్లు సంభవించాయని ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ పేలుళ్ల కారణంగా ప్రజలు భయాందోళనకు గురయ్యారని.. విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అన్నారు. పేలుళ్ల శబ్దం వినిపించిన వెంటనే పలు ప్రాంతాల్లో సైరన్లు మోగించి ప్రజలను అప్రమత్తం చేశామని చెప్పారు. అవంతిపురం సమీపంలో ఐదుసార్లు భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు అధికారులు పేర్కొన్నారు. (Srinagar) శ్రీనగర్‌లోని దాల్ సరస్సులో క్షిపణి లాంటి వస్తువు పడినట్లు గుర్తించినట్టు వివరించారు.

Image

దాల్ సరస్సులో పడ్డ క్షిపణి భారత్–పాక్ ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇవాళ ఉదయం 11.45 గంటలకు శ్రీనగర్ లో రెండు భారీ పేలుళ్లు సంభవించాయని ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ పేలుళ్ల కారణంగా ప్రజలు భయాందోళనకు గురయ్యారని.. విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అన్నారు. పేలుళ్ల శబ్దం వినిపించిన వెంటనే పలు ప్రాంతాల్లో సైరన్లు మోగించి ప్రజలను అప్రమత్తం చేశామని చెప్పారు. అవంతిపురం సమీపంలో ఐదుసార్లు భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు అధికారులు పేర్కొన్నారు. శ్రీనగర్‌లోని దాల్ సరస్సులో క్షిపణి లాంటి వస్తువు పడినట్లు గుర్తించినట్టు వివరించారు.

భారత్ -– పాక్​ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో రైల్వే ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో శ్రీధర్‌ వెల్లడించారు. హైదరాబాద్​లో​ ప్రధాన రైల్వేస్టేషన్‌లైన సికింద్రాబాద్‌, కాచిగూడలో భారీగా భద్రతను పెంచినట్లు ఆయన తెలిపారు. సీసీ కెమెరాల సంఖ్యను సైతం పెంచి పర్యవేక్షణ చేస్తున్నట్లు చెప్పారు. ఆపరేషన్ సిందూర్​ నేపథ్యంలో భద్రత కారణాల దృష్ట్యా దేశవ్యాప్తంగా పలు ఎయిర్​పోర్ట్​లు మూసి వేయడంతో రైల్వేస్టేషన్లకు ప్రయాణికుల తాకిడి పెరిగిందన్నారు. దీంతో భద్రత కోసం ప్రత్యేక బలగాలను మోహరించినట్లు ఆయన చెప్పారు. ప్రయాణికుల రద్దీకీ అనుగుణంగా ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నామని సీపీఆర్‌వో శ్రీధర్‌ తెలిపారు.

Also read: