నల్లబ్యాడ్జీలతో బరిలోకి (Black badges)ప్లేయర్లు
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఉప్పల్ వేదికగా కాసేపట్లో జరుగబోయే సన్‌రైజర్స్, ముంబై ఇండియన్స్ ఐపీఎల్ మ్యాచ్‌కు ముందు ఓ నిమిషం మౌనం పాటించి బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలపనుంది.
ఇందులోభాగంగా ఎస్‌ఆర్‌హెచ్, ముంబై ప్లేయర్లతో పాటు మ్యాచ్ అఫీషియల్స్ చేతులకు నల్లబ్యాడ్జీలతో (Black badges) బరిలోకి దిగనున్నారు. ఈ మ్యాచ్‌లో చీర్ లీడర్స్‌కు అనుమతి లేదు.
బాణసంచా కాల్చకూడదు.. అలాగే సెలబ్రేషన్స్రద్దుచేస్తూ బీసీసీఐ గైడ్ లైన్స్ జారీ చేసింది. ఇప్పటికే ఉగ్రదాడిపై భారత్‌కు మాజీ, ప్రస్తుత క్రికెటర్లు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
తాజాగా సోషల్ మీడియా వేదికగా విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్య బాధితులకు మద్దతుగా నిలిచారు. పహల్గాం ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబసభ్యులకు సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. గాయపడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.
Also read :
Silver Jubilee : బీఆర్ఎస్.. జనతా గ్యారేజ్
Pahalgam Attack: ఉగ్రదాడిలో మృతుల పేర్లు వెల్లడి