UP: కాంగ్రెస్ ఆఫీసుపై రాళ్లదాడి

UP

యూపీ(UP) లోని అమేథి కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంపై దాడి జరిగింది. అర్ధరాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చేసిన ఈ దాడిలో పార్టీ కార్యాయంలో బయట పార్కింగ్‌ చేసిన పలు వాహనాలను ధ్వంసమయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. (UP) పార్టీ నేతల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ దాడిని బీజేపీ చేయించిందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తోంది. అమేథీలో ఓడిపోతామనే భయంలో బీజేపీ, స్మృతి ఇరానీ ఉన్నారని.. అందుకే అలా చేశారని విమర్శలు చేస్తోంది. ఈ మేరకు ‘ఎక్స్‌’ వేదికగా కాంగ్రెస్ పార్టీ స్పందించింది. కాగా, అమేథి, రాయ్‌బరేలీలో ఇవాళ ప్రియాంకగాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న వేళ దాడి వ్యవహారం కలకలం రేపుతోంది.

Also read: