Delhi : డీప్ ఫేక్స్ వ్యాప్తిని ఆపండి

డీప్ ఫేక్ వీడియోలను అరికట్టేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ ఢిల్లీ (Delhi)హైకోర్టులో ఇవాళ ఓ పిటిషన్ దాఖలైంది. ఇటీవల కేంద్ర హోం మంత్ఇర అమిత్ షా సహా పలువురిపై నకిలీ వీడియోలు వైరల్ అయిన నేపథ్యంలో పలువురు న్యాయవాదుల బృందం ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని న్యాయస్థానాన్ని కోరింది. స్పందించిన ధర్మాసనం సోషల్ మీడియా డయాస్ లకు గ్రీవెన్స్‌ అధికారులు ఉన్నారని, పిటిషనర్లు వారిని సంప్రదించారా? అని ప్రశ్నించగా.. ‘మేం చేయగలినదంతా చేశాం. గ్రీవెన్స్‌ అధికారులకు ఫిర్యాదు చేస్తే రెస్పాన్స్‌ సమయం 24 నుంచి 48 గంటల మధ్య ఉంది. వారు చర్యలు తీసుకుని, ఆ వీడియోలను తొలగించేలోగా జరగాల్సిన నష్టం జరుగుతుంది’అని ఢిల్లీ(Delhi) కోర్టుకు న్యాయవాదుల బృందం వివరించింది. దీనిపై రేపు విచారణ జరుపుతామని వెల్లడించింది.

 

Also read :

Telangana :లోక్ సభ బరిలో సామాన్యులు!

Badrachalam : 9కి చేరిన ఎన్ కౌంటర్ మృతులు