శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా ‘స్త్రీ’. (Stree) హారర్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం 2018 లో విడుదలైంది. ఈ సినిమా మొదటి భాగంలో మిస్టరీగా మిగిలిపోయింది. ఇప్పుడు సీక్వెల్‌కు సిద్ధం అయింది.ఆరేళ్ల తర్వాత ‘స్త్రీ’ (Stree) మూవీ పార్ట్ 2 ను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు. కొన్ని సెకన్లపాటు సాగే ఈ టీజర్లో రాజ్ కుమార్‌తో పాటు పంకజ్ త్రిపాఠి, అపర్శక్తి ఖురానా, అభిషేక్ బెనర్జీ చందేరీ అలరించారు. ఇందులో కామెడీ, హారర్‌తో పాటు స్త్రీ కోపం ఎంత భయంకరంగా ఉంటుందో చూపించారు. అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి మడాక్ ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దినేష్ విజన్ నిర్మిస్తున్నారు.
Also read:

