బోయింగ్ స్టార్ లైనర్ రాకెట్ లో టెక్నికల్ సమస్యతో నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్ (Sunita Williams) , బుచ్ విల్మోర్ అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. దీంతో మరికొన్ని నెలలపాటు వారు అంతరిక్షంలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్ లో భాగంగా ఈఏడాది జూన్ 5న వీరిద్దరు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ చేరుకున్నారు. వారం రోజుల తర్వాత జూన్ 14న భూమికి తిరిగిరావల్సి ఉంది.

కానీ స్టార్ లైనర్ రాకెట్ లో థ్రస్టర్లలో లోపాలు ఏర్పడ్డాయి. ఆ సమస్యలను సరిచేసే క్రమంలో వ్యోమగామలు భూమికి తిరిగి రావడం ఆలస్యమైంది. అయితే స్టార్ లైనర్ లో మరమ్మతులు నిర్వహించినా.. అందులో వ్యోమగాములు ప్రయాణించేందుకు నాసా ఒప్పుకోలేదు. దీంతో స్టార్ లైనర్ నిన్న న్యూ మెక్సికోలోని వైట్ శాండ్స్ స్పేస్ హర్బర్ లో సురక్షితంగా భూమిని చేరింది. ఇక స్పేస్ ఎక్స్ వచ్చే ఏడాది వ్యోమగాములను భూమికి తీసుకురానుంది.
Also read :
Cycling : సైక్లింగ్ పోటీలు ప్రారంభం
