Sunita Williams: సునీత, విల్మోర్ వచ్చేశారు

Sunita Williams

కొన్ని నెలలుగా ప్రపంచమంతా ఎదురు చూస్తున్న భారత సంతతికి చెందిన వ్యోమగామి (Sunita Williams) సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఇవాళ తెల్లవారుజామున సురక్షితంగా భూమ్మీదకు చేరుకున్నారు. తొమ్మిది నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మరో ఇద్దరు వ్యోమగాములతో కలిసి ఐఎస్ఎస్ నుంచి బయలుదేరిన వ్యోమనౌక తెల్లవారుజామున 3.27గంటలకు భూమికి చేరింది. ఫ్లోరిడాలోని సముద్రజలాల్లో దిగిన వ్యోమగాములను అక్కడి నుంచి నాసా సెంటర్​ కు తరలించారు. వారిని కొన్ని రోజుల పాటు అక్కడే ఉంచి వైద్య పరీక్షలు చేస్తారు.

Imageవ్యోమగాములు సురక్షితంగా భూమ్మీదకు చేరడం పట్ల ప్రపంచ వ్యాప్తంగా సంతోషం వ్యక్తం అవుతోంది. ఎనిమిది రోజుల యాత్రకోసమని గత ఏడాది జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన (Sunita Williams) సునీత, విల్మోర్… చాలాకాలం అక్కడే చిక్కుకుపోయారు. 286రోజులు ఐఎస్ఎస్ లోనే గడిపిన తర్వాత వారిద్దరు క్రూ డ్రాగన్​ లో నిన్న భూమ్మీదకు బయలుదేరారు. సునీత విలియమ్స్ విజయం మన దేశానికి గర్వకారణమని కేంద్ర మంత్రులు రాజ్​ నాథ్​ సింగ్​, జితేంద్రసింగ్​ అన్నారు. ఆమెను క్షేమంగా భూమ్మీదకు తీసుకొచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Image

కొన్ని నెలలుగా ప్రపంచమంతా ఎదురు చూస్తున్న భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఇవాళ తెల్లవారుజామున సురక్షితంగా భూమ్మీదకు చేరుకున్నారు. తొమ్మిది నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మరో ఇద్దరు వ్యోమగాములతో కలిసి ఐఎస్ఎస్ నుంచి బయలుదేరిన వ్యోమనౌక తెల్లవారుజామున 3.27గంటలకు భూమికి చేరింది. ఫ్లోరిడాలోని సముద్రజలాల్లో దిగిన వ్యోమగాములను అక్కడి నుంచి నాసా సెంటర్​ కు తరలించారు. వారిని కొన్ని రోజుల పాటు అక్కడే ఉంచి వైద్య పరీక్షలు చేస్తారు.

Image

వ్యోమగాములు సురక్షితంగా భూమ్మీదకు చేరడం పట్ల ప్రపంచ వ్యాప్తంగా సంతోషం వ్యక్తం అవుతోంది. ఎనిమిది రోజుల యాత్రకోసమని గత ఏడాది జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సునీత, విల్మోర్… చాలాకాలం అక్కడే చిక్కుకుపోయారు. 286రోజులు ఐఎస్ఎస్ లోనే గడిపిన తర్వాత వారిద్దరు క్రూ డ్రాగన్​ లో నిన్న భూమ్మీదకు బయలుదేరారు. సునీత విలియమ్స్ విజయం మన దేశానికి గర్వకారణమని కేంద్ర మంత్రులు రాజ్​ నాథ్​ సింగ్​, జితేంద్రసింగ్​ అన్నారు. ఆమెను క్షేమంగా భూమ్మీదకు తీసుకొచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Image

Also read: