Supreme court: నెలకు రూ. కోటి భరణం ఇవ్వాలా..?

విడాకుల కోసం ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో(Supreme court) సీజేఐ జస్టిస్ గవాయ్ బెంచ్ ఎదుట వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా మహిళ పలు కోరికలను కోర్టు ముందుంచారు. మహిళ కోరుకున్న డిమాండ్లు విని అవాక్కయ్యిన సీజేఐ. జీవనభృతి కోసం మీ డిమాండ్ ఏమిటని ప్రశ్నించగా.. ముంబైలోని ఇల్లు, అన్ని రకాల ఖర్చుల నుంచి విముక్తి, మెయిన్‌టెన్స్‌ కోసం రూ.12 కోట్లు ఇవ్వాలని కోరింది. ‘మీరు కోరిన ఆ ఇల్లు కల్పతరులో ఉంది. ఒకానొక మంచి బిల్డర్‌ది. మీరేమో ఐటీ పర్సన్‌. ఎంబీఏ కూడా చేశారు.(Supreme court) మీలాంటి వాళ్లకు డిమాండ్‌ ఉంది. బెంగళూరు హైదరాబాద్‌లలో మీరెందుకు ఉద్యోగం చేయకూడదు? పెళ్లయిన తరువాత మీ దాంపత్యం 18 నెలలు సాగింది. ఇప్పుడు మీకు బీఎండబ్ల్యూ కూడా కావాలా?’ పద్దెనిమిది నెలల వైవాహిక జీవితానికి నెలకొ రూ.కోటి చొప్పున కావాలా?’’ అని సీజేఐ ప్రశ్నించారు. ‘అతడు బాగా ధనవంతుడు. నాకు స్కిజోఫ్రెనియా ఉందని, వివాహం రద్దు చేయాలని అతడే కోరాడు’ అంటూ బాధితురాలు సమాధానం చెప్పింది. ‘ఎవరిని ప్రభావితం చేశాడు?? మీరు ఆ ఫ్లాట్‌తో సంతృప్తి చెందండి లేదా రూ. 4 కోట్లు తీసుకొని మంచి ఉద్యోగం చూసుకోండి.’ అంటూ సీజేఐ సూచించారు. భర్త ఇచ్చే భరణంతోపాటు తన పోషణకు తాను కూడా పనిచేయాలని ఆమెను ఆదేశించారు.

Also Read :