విద్యను వ్యాపారంగా మార్చిన సంస్థలకు (Supreme Court) సుప్రీం కోర్టు గట్టి షాక్ ఇచ్చింది.నిబంధనలను బేఖాతరు చేసిన కాలేజీలపై తీవ్రంగా మండిపడింది.రాజస్థాన్‌లోని పది ప్రైవేట్ డెంటల్ కళాశాలల అక్రమ అడ్మిషన్లపై కీలక తీర్పు వెలువరించింది.మెనేజ్‌మెంట్ కోటా పేరుతోమెరిట్‌ను పూర్తిగా పక్కనబెట్టినిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాలు కల్పించినందుకు (Supreme Court) సుప్రీం కోర్టు ఈ చర్యలు తీసుకుంది.
ఒక్కో కళాశాలపై రూ.10 కోట్ల జరిమానా విధించింది.మొత్తంగా రూ.100 కోట్ల పెనాల్టీ విధిస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసింది.నిర్ణీత గడువులోగా ఈ మొత్తాన్ని చెల్లించాలని స్పష్టం చేసింది.దేశంలోని వైద్య, దంత వైద్య విద్యలో
జవాబుదారీతనం పెంచే దిశగాఈ తీర్పు చారిత్రాత్మకమని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
కేసు నేపథ్యాన్ని పరిశీలిస్తేరాజస్థాన్‌లోని కొన్ని ప్రైవేట్ డెంటల్ కాలేజీలునీట్ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించినట్లు తేలింది.మెరిట్ జాబితాను పట్టించుకోకుండాఅనర్హులకూ అడ్మిషన్లు ఇచ్చినట్లు కోర్టు గుర్తించింది.
నిర్ణీత కౌన్సెలింగ్ ప్రక్రియను పాటించలేదని తేల్చింది.లాభాపేక్షే ప్రధాన లక్ష్యంగాఈ అడ్మిషన్లు జరిగినట్లు సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.విద్యాసంస్థలు ఎప్పుడూ వ్యాపార కేంద్రాలుగా మారకూడదని స్పష్టం చేసింది.
విద్య అనేది సేవా భావంతో ఉండాలనిడబ్బుతో కొనుక్కోగల వస్తువుగా మారకూడదని కోర్టు అభిప్రాయపడింది.
ఇలాంటి అక్రమాలు భవిష్యత్తులో సహించబోమని హెచ్చరించింది.అడ్మిషన్లలో అక్రమాలకు పాల్పడిన ప్రతి కళాశాలరూ.10 కోట్ల జరిమానాను తప్పనిసరిగా చెల్లించాలని ఆదేశించింది.ఈ విషయంలో ఎలాంటి సడలింపులు ఉండవని తేల్చి చెప్పింది.
ఇక అక్రమ మార్గాల్లో ప్రవేశం పొందిన విద్యార్థుల విషయంలో కూడాకోర్టు కఠినంగా వ్యవహరించింది.నిబంధనలకు విరుద్ధంగా వచ్చిన అడ్మిషన్లు చెల్లవని స్పష్టం చేసింది.భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండాపటిష్టమైన పర్యవేక్షణ ఉండాలనినేషనల్ మెడికల్ కమిషన్‌కు ఆదేశాలు జారీ చేసింది.అలాగే డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను కూడాపర్యవేక్షణ మరింత కఠినంగా చేయాలని సూచించింది.ప్రవేశ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా ఉండాలని తెలిపింది.
ఈ జరిమానాల ద్వారా వసూలైన నిధులనురాష్ట్రంలోని వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించాలని కోర్టు సూచించింది.లేదా పేద విద్యార్థుల విద్య కోసం ఉపయోగించాలని పేర్కొంది.సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ తీర్పు
దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ విద్యాసంస్థల్లో వణుకు పుట్టిస్తోంది.ముఖ్యంగా మేనేజ్‌మెంట్ కోటా పేరుతో అక్రమాలకు పాల్పడే సంస్థలకు ఇది గట్టి హెచ్చరికగా మారింది.
ఇది కేవలం రాజస్థాన్‌కే పరిమితం కాదని న్యాయ నిపుణులు అంటున్నారు.దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనివైద్య, దంత వైద్య కళాశాలలు అప్రమత్తంగా ఉండాల్సిందేనని హెచ్చరిస్తున్నారు.మెరిట్‌కు ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని
ధనబలంతో సీట్లు దక్కే సంస్కృతిని అరికట్టాల్సిందేననిసుప్రీం కోర్టు ఈ తీర్పుతో స్పష్టమైన సందేశం ఇచ్చింది.
మొత్తంగాభారత విద్యా వ్యవస్థలో పారదర్శకత, న్యాయం కోసంఈ తీర్పు మైలురాయిగా నిలవనుంది.
Also read:

