Supreme court: మూడు నెలల్లో స్పీకర్ డెసిషన్ తీసుకోవాలె

మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి – పార్టీ ఫిరాయింపులపై BRS న్యాయవాదుల స్పందన

తెలంగాణలో ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంపై సుప్రీంకోర్టు(Supreme court) ఇచ్చిన తీర్పు తర్వాత బీఆర్ఎస్ తరఫు న్యాయవాది సోమా భరత్ ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, పార్టీ ఫిరాయింపుల చట్టం కాంగ్రెస్ నాయకుడు రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టినదే అని గుర్తు చేశారు.

సోమా భరత్ వ్యాఖ్యలు:

  • 400 మంది ఎంపీలతో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ చట్టాన్ని తీసుకువచ్చిందని చెప్పారు.

  • గత 12 ఏళ్లలో 8 ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుల వల్లే కోల్పోయింది అని పేర్కొన్నారు.

  • కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ ఆశయాలకు నిబద్ధంగా ఉండాలని, సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.(Supreme court)

  • పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు.

మోహిత్ రావు వ్యాఖ్యలు:

  • సుప్రీంకోర్టు తీర్పులో మూడు నెలల డెడ్‌లైన్ ఉన్నదని తెలిపారు.

  • విచారణకు ఎమ్మెల్యేలు సహకరించకపోతే, దానికి తగిన విధంగా స్పందించే అవకాశం ఉందని చెప్పారు.

  • మేము కోరుకున్న తీర్పే సుప్రీం కోర్టు నుంచి వచ్చింది” అంటూ ఆయన హర్షం వ్యక్తం చేశారు.

  • తగిన ఆధారాలు చూపకుండా స్పీకర్ ఆలస్యం చేయాలంటే అది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని వ్యాఖ్యానించారు.

Also Read :