SupremeCourt: గచ్చిబౌలి భూములపై నిపుణుల కమిటీ

SupremeCourt

గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములపై అధ్యయనం చేసేందుకు నెల రోజుల్లో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు (SupremeCourt) ఆదేశించింది. ఈ అంశంపై ఆరు నెలల్లో నివేదిక అందజేయాలని, అప్పటివరకు చెట్ల నరికివేతను నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదిగా చేర్చారు. ఉదయం జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టి, హైకోర్టు రిజిస్ట్రీని మధ్యాహ్నం 3.30లోపు నివేదిక సమర్పించమని ఆదేశించింది. నివేదిక అందిన వెంటనే సాయంత్రం 4 గంటలకు తదుపరి విచారణ చేపట్టింది.

Image

Image

 

Image

(SupremeCourt) సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

విచారణ సందర్భంగా “చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకున్నారని?” ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, “ఇది తీవ్రమైన అంశం” అని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు. పర్యావరణ ప్రభావ అంచనా (EIA) తీసుకున్నారా? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతులు పొందారా?” అని నిలదీశారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు భూమిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేశారు. “మూడు రోజుల్లో వంద ఎకరాల్లో చెట్లు నరికివేయడం సాధారణ విషయం కాదు” అని ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హైకోర్టు రిజిస్ట్రార్ పంపిన ఫొటోలు పరిశీలించిన తర్వాత “ఇక్కడ ఏం జరుగుతోంది?” అని కోర్టు ప్రశ్నించింది.

Image

ప్రభుత్వ వాదన – కోర్టు ప్రతిస్పందన

“ఇది అటవీ భూమి కాదు” అని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు వివరణ ఇచ్చింది. అయితే, “వందల కొద్దీ యంత్రాలు మోహరించి చెట్లు నరికివేయాల్సిన అవసరం ఏమిటి?” అంటూ కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఈ కేసుపై ఇంకా విచారణ కొనసాగుతోంది.

ప్రభుత్వ వాదన – కోర్టు ప్రతిస్పందన

“ఇది అటవీ భూమి కాదు” అని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు వివరణ ఇచ్చింది. అయితే, “వందల కొద్దీ యంత్రాలు మోహరించి చెట్లు నరికివేయాల్సిన అవసరం ఏమిటి?” అంటూ కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఈ కేసుపై ఇంకా విచారణ కొనసాగుతోంది.

Also read: