తైవాన్ (Taiwan)పార్లమెంట్ లో రణరంగం జరిగింది. సభలో ఎంపీలు ఒకరిపై ఒకరు తన్నుకున్నారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి గందరగోళం సృష్టించారు. పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు. పార్లమెంట్‌లో సంస్కరణలకు సంబంధించి సభలో నిన్న ఓ బిల్లును ప్రతిపాదించారు. ఈ సందర్భంగా విపక్షాలు కొన్ని డిమాండ్లు చేశాయి. ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించేందుకు ఎంపీలకు మరింత ఎక్కువ అధికారాలు ఉండాలని పట్టుబట్టాయి. 
పార్లమెంట్‌లో తప్పుడు ప్రకటనలు ఇచ్చే సభ్యులపై నేరాభియోగాలు మోపేలా బిల్లులో ప్రతిపాదనలు చేయడాన్ని వ్యతిరేకించాయి.

ఈ బిల్లు ఓటింగ్‌కు రావడానికి ముందే ప్రజాప్రతినిధుల ఛాంబర్‌లో సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. టేబుళ్లపైకి ఎక్కి దూకండం, తోటి ఎంపీలను బెంచీలపై నుంచి కిందకు తోసేయడం చేశారు.

ఓ ఎంపీ ఫైళ్లు లాక్కొని పార్లమెంట్ నుంచి బయటకు పరుగులు తీశాడు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. శాసనసభ మెజారిటీ లేకున్నా అధ్యక్షుడిగా ఎన్నికైన చింగ్ తే బాధ్యతలు చేపట్టడానికి కొన్ని రోజుల ముందు ఈ ఘటన జరగడం గమనార్హం.
Also read :
Vijayashanti : నా ఉద్దేశం అదికాదు
Malla Reddy : మాజీ మంత్రి మల్లారెడ్డి అరెస్ట్

