గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం యావత్ దేశం ముస్తాబవుతున్న వేళ, (Tamil Nadu) తమిళనాడులో హింసాత్మక ఘటనలు కలకలం రేపాయి. మధురైలో వేర్వేరు ప్రాంతాల్లో గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్, కిరోసిన్ బాంబులతో దాడులు చేశారు. (Tamil Nadu) ఈ ఘటనల్లో పలువురు స్థానికులు గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.రాత్రి ద్విచక్ర వాహనాలపై వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని దుండగులు సుబ్రమణ్యపురం మార్కెట్ వద్ద పెట్రోల్ బాంబును, సోలై అళగుపురం పరిధిలోని మహాలక్ష్మి నగర్ సమీపంలో కిరోసిన్ బాంబును విసిరారు. అలాగే జైహింద్‌పురం సమీపంలో మరో ఘటనలో ఇద్దరు యువకులపై దాడి చేసి దుండగులు పరారయ్యారు. గాయపడిన వారిని ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రికి తరలించారు.
ఈ మూడు ఘటనలు జైహింద్‌పురం పోలీస్ స్టేషన్ పరిధిలోనే జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఉన్నతాధికారులు సంఘటనా స్థలాలకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఘటనలు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి.పెరంబలూర్‌లో గతంలో జరిగిన పెట్రోల్ బాంబు దాడికి ప్రతీకార చర్యగా ఈ ఘటనలు జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పెరంబలూర్ ఘటన ఈ నెల జనవరి 24న చోటు చేసుకుంది. చెన్నైకి తరలిస్తున్న సమయంలో గంజాయి కేసు నిందితుడు, దిండిగల్ హిస్టరీ షీటర్ అయిన కాళి ఎస్కార్ట్ కాన్వాయ్‌పై నిందితులు పెట్రోల్ బాంబులు విసిరారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఈ నేపథ్యమే మధురైలో జరిగిన తాజా దాడులకు కారణమై ఉండవచ్చని పోలీసులు పలు కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.
Also read:

