టీచర్ ఉద్యోగాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారికి సీఎం రేవంత్ రెడ్డి సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. టెట్(TEACHERS ELIGIBILITY TEST) నోటిఫికేషన్ ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ రిటెన్ టెస్టు(సీబీఆర్టీ) ద్వారా టెట్(TEACHERS ELIGIBILITY TEST) నిర్వహించనుంది. ఇందుకోసం అర్హులైన అభ్యర్థులు ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చును.
ఈ నెల 20న టెట్ పూర్తి స్థాయి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. టెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ గడువును కూడా పెంచుతున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. జూన్ 15వ తేదీన టెట్ ఫలితాలను వెల్లడించనున్నట్ట తెలిపింది. డీఎస్సీ కోసం జూన్ 20వ తేదీ వరకు పొడిగించింది.

టెట్ పాసైనోళ్లు డీఎస్సీకి అర్హులు
ఈ ఏడాది నిర్వహించే టెట్(టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్) పాసైనవాళ్లందరూ డీఎస్సీ రాసేందుకు అర్హులు. ఇందుకోసం డీఎస్సీ దరఖాస్తు తేదీలను పొడిగించి మరికొంతమందికి ఊరట కల్పించింది. జూన్ 15న టెట్ ఫలితాలు విడుదల అయిన తర్వాత డీఎస్సీ దరఖాస్తు కోసం మరో ఐదు రోజుల గడువు ఉంటుంది. ఈ సారి టెట్ పాసైనోళ్లూ డీఎస్సీకి అర్హులుగా మారనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
Also read: