Disha: దిశాకు కల్కీ టీం విషెస్

Disha

టాలీవుడ్ తో పాటు దేశవ్యాప్త ఉన్న సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా కల్కి 2898. ప్రభాస్ హీరోగా, దీపిక పదుకునే హీరోయిన్ గా భారీస్థాయిలో తెరకెక్కుతున్న సినిమా.. ఈ నెల 27న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. (Disha) ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా.. అది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో దీపికాతో పాటు మరో బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశా పటానీ (Disha) కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

Image

ట్రైలర్ ను బట్టి చూస్తే.. దీపికాకి దిశా పటాని ఏమాత్రం తగ్గలేదనట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే కల్కిలో దిశాపటాని లుక్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇవాళ దిశా పుట్టిన రోజు సందర్భంగా తాజాగా మరో ఆసక్తికర పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆమెకు బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ దిశా ప‌టానీ కొత్త పోస్టర్‌ను విడుద‌ల చేశారు. పోస్టర్ ను బట్టి కల్కిలో దిశా రోక్సి పాత్రలో క‌నిపించ‌బోతున్నట్లు తెలుస్తుంది. ఎప్పటిలాగే ఈ పోస్టర్ కూడా చాలా బాగుందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం దిశా కల్కి పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా అవుతోంది. సోషల్ మీడియాలోనూ అందాలు ఆరబోస్తూ.. దిశా పటాని ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఇకపోతే కల్కి సినిమాలో ఈ బ్యూటీ ప్రధాన ఆకర్షణగా నిలవడం ఖాయమంటూ నెటిజన్లు అంటున్నారు.

Image

Also read: