(America) అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను అగ్రరాజ్యం ప్రత్యేక విమానంలో వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. మొత్తంగా 104 మంది ఆ విమానంలో స్వదేశానికి చేరుకున్నారు. అలా స్వదేశానికి తిరిగి వచ్చిన వారిని కదిలిస్తే కన్నీరు పెట్టుకుంటున్నారు. అగ్రరాజ్యంలో పెద్ద జీతాలకు ఉద్యోగాలిప్పిస్తాన్న ఏజెంట్ల మాటలు నమ్మి లక్షలు పోసి మోసపోయామని, మళ్లీ ఇంటికి తిరిగి వస్తామనుకోలేదంటున్నారు. పంజాబ్లోని హోషియాపుర్ జిల్లా తహ్లీ గ్రామానికి చెందిన హర్వీందర్ సింగ్ (America) అమెరికాలో కొలువు కోసం ఏజెంట్ కు రూ. 42 లక్షలు ఇచ్చి మోసపోయాడు.
తర్వాత వీసా రాలేదని చెప్పడంతో ఢిల్లీ నుంచి ఖతర్ మీదుగా బ్రెజిల్ వెళ్లాడు. తర్వాత అక్కడి నుంచి అమెరికా చేరుకున్నాడు. ట్రంప్ ఎఫెక్ట్ తో అక్కడి పోలీసులకు చిక్కి తిరిగి నిన్న స్వగ్రామానికి చేరుకున్నాడు. తాము అమెరికా వెళ్లేందుకు నడిచిన దారిలో శవాలు కనిపించాయని, ఎవరికైనా ప్రమాదం జరిగితే పట్టించుకోనే వారు లేరని ఆవేదన చెందారు. అమెరికాలో అడుగు పెట్టిన వెంటనే పోలీసులు తమను అరెస్టు చేశారని, పదిహేను రోజుల పాటు చీకటి గదుల్లో బంధించి ఎట్టకేలకు కాళ్లకు బేడీలు వేసి స్వదేశానికి చేర్చారని చెప్పారు.

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను అగ్రరాజ్యం ప్రత్యేక విమానంలో వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. మొత్తంగా 104 మంది ఆ విమానంలో స్వదేశానికి చేరుకున్నారు. అలా స్వదేశానికి తిరిగి వచ్చిన వారిని కదిలిస్తే కన్నీరు పెట్టుకుంటున్నారు. అగ్రరాజ్యంలో పెద్ద జీతాలకు ఉద్యోగాలిప్పిస్తాన్న ఏజెంట్ల మాటలు నమ్మి లక్షలు పోసి మోసపోయామని, మళ్లీ ఇంటికి తిరిగి వస్తామనుకోలేదంటున్నారు. పంజాబ్లోని హోషియాపుర్ జిల్లా తహ్లీ గ్రామానికి చెందిన హర్వీందర్ సింగ్ అమెరికాలో కొలువు కోసం ఏజెంట్ కు రూ. 42 లక్షలు ఇచ్చి మోసపోయాడు.

Also read: