(Telangana) తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని మరాఠి గ్రామం పాలజ్. ఈ చిన్న మారుమూల పల్లె వినాయక నవరాత్రి ఉత్సవాల్లో పట్నమవుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతో సందడిగా మారుతుంది. వినాయక నవరాత్రుల్లో ఈ గ్రామస్తులు కర్ర గణేశుని ప్రతిష్ఠించి పూజించడమే ఈ పాలజ్ ప్రత్యేకత. ఇక్కడ కొలువుదీరే కర్రగణేశుడు కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా పేరొందాడు. పాలజ్‌లో ప్రభుత్వం నుంచి ఏ ఒక్క అధికారి లేకపోయినా ఆలయ కమిటీ, గ్రామస్తులు కలిసి సమష్టిగా లక్షలాది భక్తులకు సౌకర్యాలను సమకూరుస్తుంటారు. గణేశ్ ఉత్సవాలన్ని రోజులూ ఈ ఊరి పేరు ఉత్తర (Telangana) తెలంగాణ, మహారాష్ట్రలోని అందరి నోళ్లలో నానుతుంది. నిర్మల్ జిల్లాలోని కుభీర్‌కు పక్కనే మహారాష్ట్రలోని భోకర్ తాలూకాలో పాలజ్ గ్రామం ఉంటుంది. ఇక్కడ 1948లో నిర్మల్‌కు చెందిన నకాషీ కళాకారుడు పోలకొండ గుండాజీ వర్మ కర్రతో మలిచిన వినాయకుడికి ప్రతిష్ఠాపన చేసి ప్రతియేటా పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి వినాయకచవితి సందర్భంగా కర్ర గణేశుడిని ప్రతిష్ఠించి, చివరిరోజు సమీప వాగులో పూజలు జరిపి నిమజ్జనోత్సవంగా భావిస్తారు. అనంతరం కర్ర విగ్రహాన్ని తిరిగి ఆలయంలోని బీరువాలో భద్రపరుస్తారు. కేవలం వినాయక నవరాత్రులప్పుడు మాత్రమే పాలజ్ కర్రగణేశుడు దర్శనమిస్తాడు. మిగతా సమయంలో ఇక్కడి ఆలయంలో గణేశుడి ఫొటో మాత్రమే ఉంటుంది.
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని మరాఠి గ్రామం పాలజ్. ఈ చిన్న మారుమూల పల్లె వినాయక నవరాత్రి ఉత్సవాల్లో పట్నమవుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతో సందడిగా మారుతుంది. వినాయక నవరాత్రుల్లో ఈ గ్రామస్తులు కర్ర గణేశుని ప్రతిష్ఠించి పూజించడమే ఈ పాలజ్ ప్రత్యేకత. ఇక్కడ కొలువుదీరే కర్రగణేశుడు కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా పేరొందాడు. పాలజ్‌లో ప్రభుత్వం నుంచి ఏ ఒక్క అధికారి లేకపోయినా ఆలయ కమిటీ, గ్రామస్తులు కలిసి సమష్టిగా లక్షలాది భక్తులకు సౌకర్యాలను సమకూరుస్తుంటారు. గణేశ్ ఉత్సవాలన్ని రోజులూ ఈ ఊరి పేరు ఉత్తర తెలంగాణ, మహారాష్ట్రలోని అందరి నోళ్లలో నానుతుంది. నిర్మల్ జిల్లాలోని కుభీర్‌కు పక్కనే మహారాష్ట్రలోని భోకర్ తాలూకాలో పాలజ్ గ్రామం ఉంటుంది. ఇక్కడ 1948లో నిర్మల్‌కు చెందిన నకాషీ కళాకారుడు పోలకొండ గుండాజీ వర్మ కర్రతో మలిచిన వినాయకుడికి ప్రతిష్ఠాపన చేసి ప్రతియేటా పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి వినాయకచవితి సందర్భంగా కర్ర గణేశుడిని ప్రతిష్ఠించి, చివరిరోజు సమీప వాగులో పూజలు జరిపి నిమజ్జనోత్సవంగా భావిస్తారు. అనంతరం కర్ర విగ్రహాన్ని తిరిగి ఆలయంలోని బీరువాలో భద్రపరుస్తారు. కేవలం వినాయక నవరాత్రులప్పుడు మాత్రమే పాలజ్ కర్రగణేశుడు దర్శనమిస్తాడు. మిగతా సమయంలో ఇక్కడి ఆలయంలో గణేశుడి ఫొటో మాత్రమే ఉంటుంది.![]()
కలరాను పారదోలిన గణపయ్య
స్వాతంత్య్రానికి పూర్వం పాలజ్ గ్రామంలో కలరా, ప్లేగు వ్యాధులు ప్రబలి ఊరంతా మంచం పట్టింది. ఇదే సమయంలో వినాయక చవితి పండుగ వచ్చింది. ఊరి ప్రజలంతా గణేశుని నమ్ముకుందాం.. అని నిశ్చయించుకున్నారు. ఇందుకు ప్రత్యేకంగా కర్రగణపతిని చేయించి ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. అందుకోసం నిర్మల్‌లో కొయ్యబొమ్మలు చేసే నకాషీ కళాకారుడైన గుండాజీవర్మను రప్పించి సుందరమైన కర్ర గణేశుడి విగ్రహాన్ని చేయించారు. ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఊరంతా మొక్కితేనే వ్యాధులన్నీ దూరమయ్యాయని గ్రామపెద్దలు చెబుతారు.
పాలజ్ ఎలా వెళ్లాలి..
హైదరాబాద్ నుంచి వచ్చేవారు నిజామాబాద్, బాసరల మీదుగా భైంసా చేరుకుంటే దూరభారం తగ్గుతుంది. నిర్మల్ మీదుగా వచ్చేవాళ్లు కూడా భైంసా మీదుగానే పాలజ్‌కు వెళ్లాల్సి ఉంటుంది. భైంసా నుంచి 23 కిలోమీటర్ల దూరంలో పాలజ్ ఉంటుంది. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది.
Also read:
Raj Tarun: ఔను.. వాళ్లిద్దరూ కలిసున్నారు!
KCR : ఫామ్‌హౌస్‌లో కేసీఆర్నవగ్రహ మహాయాగం
