Telangana: తెలంగాణ రైజింగ్ అన్ స్టాపబుల్

తెలంగాణ (Telangana) అభివృద్ధి దిశగా నిరంతర ప్రయాణం కొనసాగుతుందని, “తెలంగాణ రైజింగ్ అన్ స్టాపబుల్” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భవిష్యత్ వృద్ధి దిశగా రాష్ట్రం వేగంగా కదులుతుందని, 2047 నాటికి తెలంగాణను మూడో ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న (Telangana) తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలు, నిపుణుల సమక్షంలో రాష్ట్ర అభివృద్ధిపై తమ విజన్‌ను వివరించారు.

Image

యంగెస్ట్ స్టేట్ – యంగెస్ట్ ఎనర్జీ

2014లో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ కృషితో ఏర్పడిన తెలంగాణ దేశంలోనే యంగెస్ట్ స్టేట్‌గా ఉండి, కొత్త ఆలోచనలు, కొత్త అవకాశాలు, కొత్త దారులతో ముందుకు సాగేందుకు సిద్ధమైదని ఆయన తెలిపారు. తెలంగాణకు దేశ జీడీపీలో 5% వాటా ఉండటం రాష్ట్రంలోని అభివృద్ధి శక్తిని సూచిస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Image

క్యూర్ – ప్యూర్ – రేర్ మోడల్

రాష్ట్ర అభివృద్ధిని మూడు విభాగాలుగా విభజించి ముందుకు తీసుకెళ్లాలని సీఎం ప్రకటించారు.

  • క్యూర్ (Cure) – ఆరోగ్య రంగ విస్తరణ, మెడికల్ టూరిజం, ఫార్మా హబ్

  • ప్యూర్ (Pure) – శుభ్రమైన పరిశ్రమలు, పర్యావరణ పరిరక్షణ, ఎకో-ఫ్రెండ్లీ అభివృద్ధి

  • రేర్ (Rare) – ప్రీమియం టెక్నాలజీ, అరుదైన ఇన్నోవేషన్ రంగాలు

ఈ మోడల్ తెలంగాణను ప్రపంచ పెట్టుబడిదారుల ముందు ప్రత్యేక గమ్యస్థానంగా నిలబెట్టే లక్ష్యంతో రూపొందించబడిందని సీఎం వివరించారు.

ప్రత్యర్థులు దేశాలు…!

తెలంగాణ పోటీ దేశీయ రాష్ట్రాలతో కాకుండా జపాన్, చైనా, జర్మనీ, సౌత్ కొరియా వంటి ప్రపంచ దిగ్గజాలతో ఉండేలా అభివృద్ధి వ్యూహరచన చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో అపారమైన అవకాశాలు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం, పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న సహకారం ఇవన్నీ కలిసి Telangana Rising‌ను ప్రపంచ ర్యాంకుల్లో ముందుకు తీసుకెళ్తాయని ఆయన పేర్కొన్నారు.

Image

విజన్ తెలంగాణ రోడ్ మ్యాప్

రేపు “విజన్ తెలంగాణ” రోడ్ మ్యాప్ విడుదల చేయనున్నట్టు సీఎం ప్రకటించారు. 2047లో భారత స్వాతంత్ర్యానికి 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశ అభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషించాలన్నదే తన సంకల్పమని వివరించారు. సర్వీస్, మాన్యుఫ్యాక్చరింగ్, వ్యవసాయ రంగాల సమతుల్య అభివృద్ధీకే ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు.

Image

గ్వాంగ్‌డాంగ్ – తెలంగాణకు ప్రేరణ

చైనాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్ అగ్రస్థానంలో ఉంటుంది.
ఈ ప్రాంతం తెలంగాణకు ఎందుకు మోడల్‌గా తీసుకుంటున్నారంటే:

Image

  • భారీ విదేశీ పెట్టుబడులు

  • పరిశ్రమల వేగవంతమైన విస్తరణ

  • షెన్‌జెన్ – ప్రపంచ టెక్నాలజీ క్యాపిటల్

  • గ్వాంగ్‌జౌ – వాణిజ్యం, రవాణా, సేవల హబ్

  • విస్తృత తయారీ సామర్థ్యం – ప్రపంచ ఫ్యాక్టరీగా పేరుగాంచటం

  • అత్యాధునిక రోడ్లు, హైస్పీడ్ రైళ్లు, పోర్టులు

ఈ సమతుల్య మౌలిక సదుపాయాలు గ్వాంగ్‌డాంగ్‌ను ప్రపంచ ఆర్థిక పటంలో కీలక ప్రదేశంగా నిలబెట్టాయి. ఇదే మోడల్‌ని తెలంగాణ తన అభివృద్ధి దిశగా అనుసరించనుంది.

Also read: