Telangana: దసరా,బతుకమ్మ పండుగల కోసం

Telangana

(Telangana) రాష్ట్ర ప్రజల సౌకర్యం కోసం టీఎస్‌ఆర్టీసీ ఈ దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగా భారీ స్థాయిలో ప్రత్యేక బస్సుల ఏర్పాట్లు చేసింది. టీఎస్‌ఆర్టీసీ (Telangana) ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ నెల 20 నుంచి అక్టోబర్ 2 వరకు మొత్తం 7,754 ప్రత్యేక బస్సులు నడపనున్నారు.

Image

ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం

ఈ ప్రత్యేక సర్వీసుల్లో 377 బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. ముఖ్యంగా సద్దుల బతుకమ్మ (సెప్టెంబర్ 30), దసరా (అక్టోబర్ 2) సందర్భంగా ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున RTC ముందుగానే చర్యలు తీసుకుంటోంది.

Image

తిరుగు ప్రయాణ సౌకర్యం

ప్రయాణికుల సౌకర్యార్థం అక్టోబర్ 5, 6 తేదీల్లో కూడా RTC ప్రత్యేక సర్వీసులు నడపనుంది. రద్దీని దృష్టిలో ఉంచుకొని అవసరమైనన్ని బస్సులు జోడిస్తామని అధికారులు తెలిపారు.

Image

హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక ఏర్పాట్లు

హైదరాబాద్‌లోని ప్రధాన బస్టాండ్లు ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్ తో పాటు, రద్దీ అధికంగా ఉండే కేపీహెచ్‌బీ కాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్‌సుఖ్ నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్ ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేక బస్సులు నడపనున్నారు.

అంతర్రాష్ట్ర సేవలు

ఈ ప్రత్యేక సర్వీసులు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు కూడా నడపబడతాయి. పండుగల సమయంలో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా RTC సమగ్ర ఏర్పాట్లు చేస్తోంది.

TGSRTC | బ‌తుక‌మ్మ‌, దసరాకు టీజీఎస్ఆర్టీసీ 7754 ప్రత్యేక బస్సులు

టికెట్ ధరల సవరణ

ప్రత్యేక సర్వీసుల్లో మాత్రమే, జీవో నంబర్ 16 ప్రకారం తిరుగు ప్రయాణంలో ఖాళీగా వచ్చే బస్సుల కనీస డీజిల్ ఖర్చుల మేరకు టికెట్ ధరల్లో RTC సవరణ చేస్తుంది.
ఈ సవరణ ఛార్జీలు సెప్టెంబర్ 20, 27–30, అక్టోబర్ 1, 5, 6 తేదీల్లో నడిచే స్పెషల్ బస్సులకు మాత్రమే వర్తిస్తాయి.
అయితే రెగ్యులర్ సర్వీసుల ఛార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదు.

Image

గత ఏడాది కంటే ఎక్కువ బస్సులు

గత సంవత్సరం దసరా ప్రత్యేక బస్సులతో పోలిస్తే ఈసారి అదనంగా 617 బస్సులు RTC అందుబాటులో ఉంచుతోంది.

Image

బుకింగ్ & సమాచారం

ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్‌ను tgsrtcbus.in వెబ్‌సైట్‌లో చేసుకోవచ్చు.
అలాగే పూర్తి సమాచారం కోసం RTC కాల్‌ సెంటర్ నంబర్లు:
☎️ 040-69440000, 040-23450033.

Also read: