DELHI:ఢిల్లీ బాట పట్టిన తెలంగాణ

DELHI: kcr house in tugalk road
  • కవిత విచారణ నేపథ్యంలో గులాబీ నేతల టూర్
  • తుగ్లక్ రోడ్ లో 144 సెక్షన్

DELHI: తెలంగాణ ఢిల్లీ బాట పట్టింది. లిక్కర్ స్కాం దర్యాప్తు లో భాగంగా ఎమ్మెల్సీ కవితను గురువారం ఈడీ విచారణ నేపథ్యంలో పార్టీ నేతలు, మంత్రులు ఢిల్లీలో మకాం వేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. గురువారం ఎమ్మెల్సీ కవితను రెండోసారి ఈడీ విచారించనున్న నేపథ్యంలో తుగ్లక్ రోడ్డులోని కేసీఆర్ ఇంటి వద్ద 144 సెక్షన్ అమలు చేస్తుండడం గమనార్హం.

ఈ నెల 11న జరిగిన విచారణ సమయంలో ఈడీ కార్యాలయం వద్ద మాత్రమే 144 సెక్షన్ అమలు కాగా గురువారం జరగనున్న విచారణ నేపథ్యంలో కేసీఆర్ ఇంటి వద్ద కూడా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఇంటి వద్దకు బలగాలు కూడా చేరుకున్నాయి. ఇప్పటికే తెలంగాణ నుండి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్, భారత్ జాగృతి శ్రేణులు న్యూ ఢిల్లీకి(DELHI) చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆందోళనలు జరిగే అవకాశాలు ఉన్నాయని భావించి ముందస్తుగా 144 సెక్షన్ అమలు చేసినట్టుగా సమాచారం. అయితే 10 గంటలకు కవిత మీడియా సమావేశం ఏర్పాటు చేసిన నేపథ్యంలో అక్కడకు పెద్ద సంఖ్యలో మీడియా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు కూడా చేరుకుంటున్నారు.

ఈ క్రమంలో కేసీఆర్ ఇంటికి వెళ్లే వారిని పోలీసులు అనుమతి ఇస్తారా లేక మీడియా ప్రతినిధులను మాత్రమే వెళ్లేందుకు పర్మిషన్ ఇస్తారా అన్న విషయంపై క్లారిటీ లేదు. ఉదయం మీడియా సమావేశం తర్వాత కవిత ఈడీ విచారణ కు వెళ్లనున్నారు.  ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, కవిత సోదరుడు కేటీఆర్,  రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్​ రావు, గిరిజన, మహిళా ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఢిల్లీలోనే మకాం వేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

Also Read: